జబ్బు క్యారెక్టర్‌ వద్దన్న నాగార్జున!

జబ్బు క్యారెక్టర్‌ వద్దన్న నాగార్జున!

మారుతి చిత్రాల్లో హీరోకి ఏదో ఒక లోపం లేదా రోగం వుండడం కామన్‌ పాయింట్‌ అయిపోతోంది. భలే భలే మగాడివోయ్‌లో హీరోకి మతిమరపు కాగా, బాబు బంగారంలో ఓవర్‌ సింపతీ క్యారెక్టర్‌ హీరోది. తాజాగా మహానుభావుడులో హీరోని అతి శుభ్రంగాడిగా చూపించి నవ్వించాడు. ఈ సినిమా బాగా ఆడుతున్నా కానీ 'భలే భలే మగాడివోయ్‌' ఛాయలు చాలా వున్నాయని కొందరు పెదవి విరుస్తున్నారు.

మళ్లీ ఇదే ఫార్ములాతో ఇంకో సినిమా తీస్తే జనం తిరస్కరించినా ఆశ్చర్యం లేదు. మారుతితో తదుపరి చిత్రానికి కమిట్‌ అయిన నాగచైతన్యతోను ఇలా క్యారెక్టర్‌ బేస్డ్‌ సినిమానే చేస్తానని మారుతి చెప్పాడట. చైతన్య దానికి ఓకే చెప్పినా కానీ నాగార్జున మాత్రం మళ్లీ ఏదైనా లోపం వున్న పాత్రతో మాత్రం రావద్దని, ఏదైనా కొత్త తరహా ఎంటర్‌టైనర్‌ చేయమని మారుతికి సూచించాడట.

నిజానికి అఖిల్‌ కోసం కథ అడిగితే మారుతి 'మహానుభావుడు' కథే చెప్పాడట. కానీ ఆ కథ అఖిల్‌కి సూట్‌ అవదని, మరీ అంత వీక్‌ క్యారెక్టర్‌ వున్న సినిమా వద్దని, అతడికి స్టార్‌డమ్‌ తెచ్చే కథ కావాలని పంపించేసాడట. మరి చైతన్యతో చేసే చిత్రంలో తన ఫార్ములా వదిలేసి మారుతి ఏమి చేస్తాడనేది చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు