సేఫ్‌ గేమ్‌ ఆడుతున్న పుత్ర రత్నం

సేఫ్‌ గేమ్‌ ఆడుతున్న పుత్ర రత్నం

దడ, బెజవాడ చిత్రాలతో షాకింగ్‌ ఫెయిల్యూర్స్‌ చవిచూసిన నాగచైతన్య ఆ దెబ్బ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సడన్‌గా పెరిగిన జాగ్రత్త వల్ల గత ఏడాదిలో అతని సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ ఇయర్‌లో ఒకే ఒక్క సినిమా మాత్రం వచ్చింది. తడాఖా చూపించేయలేదు కానీ ఫర్లేదనిపించుకుని కాస్త ఊపిరి తీసుకున్నాడు. తదుపరి వచ్చే చిత్రాలు ఫ్లాప్‌ అయితే నాగ చైతన్య కెరీర్‌ ఇబ్బందుల్లో పడుతుంది కాబట్టి అలా జరగకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. అందుకే సక్సెస్‌ అయిన సినిమాల్ని రీమేక్‌ చేస్తూ సేఫ్టీ చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ప్రస్తుతం కొత్త కథల మీద కంటే వేరే భాషల్లో హిట్టయిన సినిమాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు.

తడాఖా బాగానే ఆడడంతో అతనికి రీమేక్‌ల మీద గురి కుదిరింది. మనం స్ట్రెయిట్‌ మూవీ అయినా మల్టీస్టారర్‌ కాబట్టి కౌంట్‌ చేయక్కర్లేదు. తన సోలో సినిమాలకి మాత్రం చైతూ ఇప్పుడు రీమేక్‌ మోడ్‌లో ఉన్నాడు. అక్కినేని అభిమానుల అండదండలు ఉన్నప్పటికీ చైతన్య ఇంకా హీరోగా చెప్పుకోతగ్గ స్థాయికి చేరుకోలేదు. యువ హీరోలంతా ఆదిలోనే పెద్ద హిట్స్‌ ఇచ్చి మంచి పొజిషన్‌కి వెళ్లిపోయారు. నాగచైతన్య మాత్రం ఇంకా తన తొలి బ్లాక్‌బస్టర్‌ కోసం వేచి చూస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు