దసరా సినిమాలకే రాసిచ్చేశారు

దసరా సినిమాలకే రాసిచ్చేశారు

దసరా సీజన్లో విడుదలైన మూడు సినిమాల్లో ఒక్క ‘మహానుభావుడు’ మాత్రమే సేఫ్ జోన్లోకి వచ్చింది. ఈ సినిమా లేటుగా లేటుగా వచ్చినప్పటికీ దాని కంటే ముందు వచ్చిన పెద్ద సినిమాల కంటే ముందుగా బ్రేక్ ఈవెన్ దశకు చేరుకుంది. ఈ చిత్రం భారీగా లాభాలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్లో అసలు చెప్పుకోదగ్గ కొత్త సినిమాలేవీ కూడా విడుదల కావట్లేదు. ఈ నెల 13న ‘రాజు గారి గది-2’ వచ్చే వరకు ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ ‘మహానుభావుడు’ సినిమానే. కాబట్టి ఈ చిత్రం రెండో వీకెండ్లోనూ మంచి వసూళ్లు రాబట్టి బయ్యర్లకు బాగానే లాభాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక దసరా కానుకగా విడుదలైన మిగతా రెండు పెద్ద సినిమాలు ఈ వారాంతాన్ని ఏమేరకు సద్వినియోగం చేసుకుంటాయన్నది ఆసక్తికరం. ఉన్నంతలో ఎన్టీఆర్ మూవీ ‘జై లవకుశ’కే ఇది ఎక్కువ కలిసొస్తుందని భావిస్తున్నారు. తొలి వీకెండ్ అవ్వగానే వీక్ అయిన ఈ చిత్రం.. ‘స్పైడర్’కు నెగెటివ్ టాక్ రావడంతో కొంచెం పుంజుకుంది. ‘మహానుభావుడు’ బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతుున్నప్పటికీ.. కొంతమేర ‘జై లవకుశ’ కూడా వసూళ్లు తెచ్చుకుంటోంది. ఎలాగోలా ఇప్పటికే 70 కోట్ల షేర్ మార్కును దాటేసిన ఈ చిత్రం.. ఈ వారాంతంలో పేరున్న సినిమాలేవీ లేవు కాబట్టి 80 కోట్ల మార్కుకు కూడా చేరువగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ‘స్పైడర్’ పరిస్థితి చూస్తే అది ఏ కోశానా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. బయ్యర్లకు ఇది భారీ నష్టాలే మిగిల్చేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు