హీరోకి అశ్లీల సందేశాలు పంపిన హీరోయిన్‌!

హీరోకి అశ్లీల సందేశాలు పంపిన హీరోయిన్‌!

హృతిక్‌ రోషన్‌, కంగన రనౌత్‌ల వివాదం ఇంకా సద్దుమణగలేదు. పరస్పర ఆరోపణలతో కోర్టుకి ఎక్కిన ఈ స్టార్లు ఆ తర్వాత సైలెంట్‌ అయ్యారు. అయితే సిమ్రన్‌ ప్రమోషన్స్‌లో భాగంగా కంగన ఈ తేనెతుట్టెని మళ్లీ కదిపింది. హృతిక్‌ రోషన్‌పై దారుణమైన ఆరోపణలు చేస్తూ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. దానికి తనంతట తానుగా స్పందించని హృతిక్‌ లీగల్‌గానే ఆమెని రచ్చకీడుస్తున్నాడు.

ఇంతకాలం ఆమె కెరియర్‌, క్యారెక్టర్‌ అసాసినేషన్‌ చేయరాదని భావించి కొన్ని విషయాలని హృతిక్‌ వదిలేసాడట. కానీ ఆమె వ్యవహారం శృతి మించడంతో అసలు కంగన తనని ఎంతగా వేధించినదీ, ఏ విధంగా స్టాక్‌ చేసినదీ వివరిస్తూ పెద్ద పిటీషనే దాఖలు చేసారు. ఆమె తనకి అసభ్యకరమైన, అభ్యంతరకమైన, జుగుప్సాకరమైన అశ్లీల సందేశాలు ఈమెయిల్‌ చేసేదని, దానికి తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని తన ల్యాప్‌టాప్‌తో సహా కోర్టుకి హృతిక్‌ హ్యాండోవర్‌ చేసాడు.

ఇంతకాలం కంగనపై ఇంత స్థాయిలో విరుచుకుపడని హృతిక్‌ ఈసారి వెనకా ముందు ఆలోచిస్తున్నట్టు లేడు. కంగనకి అతను గట్టిగానే బదులిస్తూ ఈ కేసు దాఖలు చేయడంతో వ్యవహారం మొదటికి వచ్చింది. అసలే కంగన సైలెంట్‌గా కూర్చునే రకం కాదు కనుక ఇది మరింత వేడెక్కుతుందని, ఈ ఆరోపణలకి ఆమె ఇచ్చే సమాధానం ఏమిటనేది చూడాలని బాలీవుడ్‌ మీడియా ఈ వ్యవహారంపై ఫోకస్‌ పెట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు