పవన్‌కళ్యాణ్‌ 'ఖుషీ' రేంజ్‌లో వున్నాడు

పవన్‌కళ్యాణ్‌ 'ఖుషీ' రేంజ్‌లో వున్నాడు

పవన్‌కళ్యాణ్‌ తదుపరి చిత్రంలో ఎలా వుండబోతున్నాడనేది ఇంతవరకు అఫీషియల్‌గా చూపించలేదు. దసరాకి అయినా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తారని చూస్తే అది జరగలేదు. దీపావళికి విడుదల చేస్తారేమో అని అభిమానులు ఆశగా చూస్తున్నారు. అయితే ఆన్‌ లొకేషన్‌ ఫోటోల ద్వారా ఇందులో పవన్‌ ఎలా కనిపిస్తాడనే దానిపై ఒక ఐడియా అయితే వస్తోంది.

ఈ చిత్రంలో పవన్‌ లుక్‌ 'ఖుషీ'లో పవన్‌ కనిపించిన లుక్‌కి దగ్గరగా వుండేట్టు స్టయిలిస్టుల ద్వారా త్రివిక్రమ్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఖుషీలో పవన్‌ హెయిర్‌ స్టయిల్‌కి తగ్గట్టే ఇందులోను పవన్‌ హెయిర్‌ కనిపించనుంది. ఇటీవల పవన్‌కి హెయిర్‌ లాస్‌ వున్నప్పటికీ అధునాతన టెక్నిక్‌ ద్వారా కృత్రిమ జుట్టుతో పవన్‌కి పూర్వపు లుక్‌ తీసుకొచ్చారు.

ఈ పాత్ర కోసమని పవన్‌ ప్రత్యేక డైట్‌ మెయింటైన్‌ చేస్తూ బరువు బాగా తగ్గాడు. మొదట్లో కనిపించిన ఆ బుగ్గలు, అవీ రీసెంట్‌ ఫోటోస్‌లో లేవు. పవన్‌ చాలా గ్లామరస్‌గా కనిపిస్తూ వుండేసరికి అభిమానులు ఫస్ట్‌ లుక్‌ కోసం మరింత ఎక్సయిట్‌ అవుతున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌, టీజర్‌ అన్నిట్లోను ఒక ప్రత్యేకత వుండాలని త్రివిక్రమ్‌ అందుకోసం ఒక సెపరేట్‌ టీమ్‌నే కేటాయించాడట. ఇంత వెయిట్‌ చేస్తున్నందుకు ఆ లుక్‌ అదే స్థాయిలో మైండ్‌ బ్లాక్‌ చేసేలా వుంటుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు