మహేష్‌ డిమాండ్‌పై రిపేర్లు మొదలు

మహేష్‌ డిమాండ్‌పై రిపేర్లు మొదలు

వరుసగా రెండు భారీ పరాజయాలు ఇచ్చిన షాక్‌ నుంచి 'శ్రీమంతుడు'తో తేరుకున్న మహేష్‌కి మళ్లీ మరో రెండు షాక్‌లు వెంటవెంటనే తగిలాయి. బ్రహ్మూెత్సవం లాంటి దారుణమైన పరాజయం తర్వాత దాదాపు ఆరు నెలలు బయటికే రాని మహేష్‌ ఏరి కోరి మురుగదాస్‌తో 'స్పైడర్‌' చేసాడు. ఏడాదిన్నర పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం మహేష్‌ కెరియర్లో ఒక మైలురాయి అవుతుందని ఊహించారు. అయితే టీజర్‌, ట్రెయిలర్ల దగ్గర్నుంచే నెగెటివ్‌ సంకేతాలు కనిపిస్తూ వచ్చినా కానీ మహేష్‌ కాన్ఫిడెన్స్‌ చూసి హిట్‌ అవుతుందనే అనుకున్నారు.

కానీ అతని నమ్మకాన్ని, అభిమానుల అంచనాలని తలకిందులు చేస్తూ స్పైడర్‌ భారీ పరాజయం దిశగా సాగుతోంది. ప్రస్తుత ట్రెండ్‌ని బట్టి కనీసం అరవై కోట్ల నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. ఈ ఫ్లాప్‌తో మరోసారి నిరాశ చెందిన మహేష్‌ తన తాజా చిత్రం 'భరత్‌ అనే నేను' షూటింగ్‌ కూడా వాయిదా వేయించాడట.

ఈ స్క్రిప్టు విషయంలో తనకి కొన్ని సందేహాలున్నా కానీ కొరటాల శివపై నమ్మకంతో ఓకే చెప్పేసిన మహేష్‌ ఇప్పుడు తనకున్న అనుమానాలు చెప్పి స్క్రిప్ట్‌ కరక్ట్‌ చేయమని చెప్పాడట. ఈసారి మహేష్‌ ఛాన్స్‌ తీసుకోలేడు కనుక స్క్రిప్ట్‌ పరంగా ఏమైనా కొత్త అంశాలు జోడించవచ్చా, లేదా మార్చవచ్చా అని చూస్తున్నారట.

ఏదేమైనా సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం వేసవికి వాయిదా పడడంతో మార్పులు చేసుకోవడానికి అయినా, షూటింగ్‌ కొద్ది రోజులు వాయిదా వేసుకోవడానికి అయినా వెసులుబాటు చిక్కింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు