శర్వా రైజింగ్.. మహేష్ ఫాలింగ్

శర్వా రైజింగ్.. మహేష్ ఫాలింగ్

ఓవైపు శర్వానంద్ సినిమా ‘మహానుభావుడు’ దూసుకెళ్లిపోతోంది. మరోవైపు మహేష్ బాబు మూవీ ‘స్పైడర్’ అంతకంతకూ డౌన్ అయిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలో సైతం ఇదే పరిస్థితి. తొలి రోజుతో పోలిస్తే ‘మహానుభావుడు’ వసూళ్లు రెండు, మూడు రోజుల్లో ఇంకా పెరగడం విశేషం. అమెరికాలో ‘మహానుభావుడు’ ప్రిమియర్లు, తొలి రోజు వసూళ్లు ఓ మోస్తరుగానే వచ్చాయి.

‘మహానుభావుడు’కు 2 లక్షల డాలర్ల లోపే వసూలయ్యాయి శుక్రవారం నాటికి. కానీ శని, ఆదివారాల్లో ఈ సినిమా అంచనాల్ని మించి పెర్ఫామ్ చేసింది. 2.7 లక్షల డాలర్ల దాకా వసూలు చేసింది. హాఫ్ మిలియన్ మార్కుకు అత్యంత చేరువగా వచ్చింది. ఈ చిత్రం ఫుల్ రన్లో మిలియన్ మార్కును కూడా దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ మహేష్ సినిమా ‘స్పైడర్’ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది.

ప్రిమియర్లతోనే మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం ఆదివారం అయ్యాక కూడా 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటకపోవడం గమనార్హం. మహేష్ బాబు సినిమా తొలి నాలుగు రోజుల్లో హాఫ్ మిలియన్ మార్కును దాటకపోవడమంటే దారుణం. ఇంకా ఈ సినిమా 1.4 మిలియన్ డాలర్ల మార్కు దగ్గరే ఉంది. శని, ఆదివారాల్లో రోజుకు లక్ష డాలర్లు మాత్రమే వసూలు చేసిందీ చిత్రం. ఈ సినిమాపై ఏకంగా రూ.15.5 కోట్ల పెట్టుబడి పెట్టాడు బయ్యర్. అంటే ఈ సినిమా 3 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేస్తేనే సేఫ్ జోన్లోకి వస్తుంది. పరిస్థితి చూస్తుంటే బయ్యర్ సగానికి సగం నష్టపోక తప్పేలా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు