‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌ ముచ్చట్లు

‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌ ముచ్చట్లు

మొత్తానికి ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ సంగతి ఖరారైంది. స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ ‘అర్జున్ రెడ్డి’తో అరంగేట్రం చేయబోతున్నాడు. స్వయంగా విక్రమే ఈ సినిమా సంగతుల్ని అధికారికంగా ప్రకటించాడు. విక్రమ్ తనయుడు సినీ తెరంగేట్రానికి కొన్నేళ్ల ముందు నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి.

విదేశాల్లో ట్రైన్ అవుతున్నాడు ధ్రువ్. విక్రమ్ కొంతమంది స్టార్ డైరెక్టర్లతో చర్చలు జరిపాడు. కథలు కూడా విన్నాడు. కానీ ఏదీ ఖరారవ్వలేదు. ఇంతలోనే ‘అర్జున్ రెడ్డి’ వచ్చింది. తమిళ ఇండస్ట్రీ జనాల్ని, విశ్లేషకుల్ని ఆ సినిమా అమితంగా ఆకట్టుకుంది. ధనుష్ ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి.

ఐతే తన కొడుకు అరంగేట్రానికి ఈ సినిమా అయితే బాగుంటుందని విక్రమ్ ధనుష్‌తో మాట్లాడగా.. రీమేక్ హక్కులు ఇచ్చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. తనకు పరిచయమున్న ఓ డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్‌తో హక్కులు కొనుగోలు చేయించి.. రీమేక్ కోసం సన్నాహాలు మొదటుపెట్టాడు విక్రమ్.

ఇంతకుముందు పోడా పోడీ, నానుమ్ రౌడీదా సినిమాలు తీసి.. ఇప్పుడు సూర్య హీరోగా ‘తానా సేంద్ర కూట్టం’ అనే సినిమా చేస్తున్న విఘ్నేష్ శివన్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నాడు. ధ్రువ్ విక్రమ్ లాగే మంచి అందగాడని.. అతడి ఫొటోలు చూస్తేనే అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ అదరగొట్టేసిన అర్జున్ రెడ్డి పాత్రను చేయడమంటే ధ్రువ్‌కు సవాలే. ఈ పాత్రలో నిరూపించుకుంటే తండ్రికి తగ్గ తనయుడన్న గుర్తింపు వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English