మహేష్‌బాబు బ్లండర్స్‌

మహేష్‌బాబు బ్లండర్స్‌

మైండ్‌లో ఫిక్స్‌ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా అని దూకుడులో ఒక డైలాగ్‌. తనతో పని చేసే దర్శకుల విషయంలో మహేష్‌ది ఇదే తీరు. తనకి ఒక దర్శకుడిపై గురి కుదిరితే ఇక అతను వెనకా ముందు ఆలోచించడు. ఆ దర్శకుడు ఏది చెబితే అది చేసుకుంటూ పోతాడు. సదరు దర్శకుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని సినిమా తీస్తే సరి.

లేదంటే మహేష్‌ ఖాతాలో పెద్ద ఫ్లాప్‌ జమ అయిపోతుంది. బ్రహ్మూెత్సవం చూసిన వారు అసలు మహేష్‌ ఈ సినిమా ఎలా చేసాడని అనుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తీసిన అడ్డాల శ్రీకాంత్‌ మీద నమ్మకంతో మహేష్‌ అది చేసేసాడు.

అలాగే స్పైడర్‌కి మురుగదాస్‌ని నమ్మి హీరోయిజం లేని పాత్రకి ఓకే చెప్పాడు. ఫలితంగా అతనికి దెబ్బ మీద దెబ్బ తగిలింది. కొరటాల శివ లాంటి దర్శకులు జాగ్రత్త పడి బలమైన కథలు చేస్తే మహేష్‌కి బ్లాక్‌బస్టర్‌ గ్యారెంటీ. అదే వేరే దర్శకులు అతడి ఇమేజ్‌ని లెక్క చేయకుండా తోచింది తీస్తే పెద్ద ఫ్లాప్‌ తథ్యం.

మహేష్‌ ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ వుంటే అభిమానులు కూడా విసిగిపోతున్నారు. స్పైడర్‌ రిలీజ్‌ తర్వాత మళ్లీ మహేష్‌ అసలు స్పందించకపోవడమే ఈ పరాజయం అతడిని ఎంత బాధిస్తోందో తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు