ఎన్టీఆర్‌ ఒక సూపర్‌ పవర్‌

ఎన్టీఆర్‌ ఒక సూపర్‌ పవర్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ పవర్‌గా అవతరిస్తున్నాడు. సగటు సినిమాలతోనే వసూళ్ల వర్షం కురిపిస్తూ స్టార్‌గా తన స్టామినా చాటుకుంటున్నాడు. మామూలు సినిమాలతోనే ఎన్టీఆర్‌ రాబడుతోన్న వసూళ్లు చూసి ట్రేడ్‌ సైతం విస్తుపోతోంది. ఈమధ్య కాలంలో వచ్చిన ఎన్టీఆర్‌ సినిమాల్లో ఏదీ యునానిమస్‌ పాజిటివ్‌ టాక్‌తో మొదలు కాలేదు.

అయినప్పటికీ అన్నిటినీ ఒక గౌరవప్రదమైన స్థాయికి ఎన్టీఆర్‌ చేర్చాడు. ఒక టైమ్‌లో బాగా వెనకబడిన తారక రాముడు మళ్లీ ఇప్పుడు టాప్‌ సీట్‌కి గట్టి కంటెండర్‌ అయ్యాడు. ఓవర్సీస్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్‌ సినిమాలకి వసూళ్లే వుండేవి కాదు. నైజాంలో కూడా అతని సినిమాలు ఇబ్బంది పడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.

ఎన్టీఆర్‌ చిత్రాలకి దర్శకులు, టాక్‌తో సంబంధం లేకుండా డాలర్లు వచ్చి పడిపోతున్నాయి. జై లవకుశతో వరుసగా మూడోసారి మిలియన్నర డాలర్ల వసూళ్లు రాబట్టాడు. ఇంతవరకు ఏ తెలుగు హీరో వల్ల ఈ ఫీట్‌ సాధ్యం కాలేదు.

రివ్యూలు కూడా గొప్పగా రాకపోయినా కానీ ఎన్టీఆర్‌ చిత్రాలు ఇలాంటి వసూళ్లు తెచ్చుకుంటూ వుంటే ఇక అన్నీ అనుకూలిస్తే ఓవర్సీస్‌లో ఎన్టీఆర్‌ సంచలనాలు చేస్తాడని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు