పూరి జగన్‌ సాయం తీసుకుంటాడా?

పూరి జగన్‌ సాయం తీసుకుంటాడా?

పూరి జగన్నాథ్‌ ఒకప్పుడు టాప్‌ డైరెక్టరే కానీ ఈమధ్య అతని సినిమా అంటే బయ్యర్లు భయపడిపోతున్నారు. తన ప్రతి సినిమా డింకీలు కొడుతున్నా కానీ ప్రతిసారీ ఏదో ఒక కాంబినేషన్‌ సెట్‌ చేసి సినిమాలు అమ్మేస్తుంటాడు. పైసావసూల్‌ దెబ్బకి ఇక పూరితో పని చేయడానికి హీరోలు కూడా జంకుతున్నారు.

ఈ నేపథ్యంలో తనయుడు ఆకాష్‌ పూరిని హీరోని చేస్తూ పూరి తన తదుపరి చిత్రం స్టార్ట్‌ చేస్తున్నాడు. దర్శకుడిగా పూరి శైలి ఇంకా పాతబడలేదు.

ఇప్పటికీ అతను ట్రెండుని ఫాలో అవుతున్నాడు కానీ కథల పరంగానే తనకి తెలిసిన మాఫియా సోదినే మళ్లీ మళ్లీ రిపీట్‌ చేస్తున్నాడు. అయితే ఇడియట్‌, లేదా పోకిరి సినిమాని రిపీట్‌గా తీస్తూ పూరి జగన్నాథ్‌ ఇప్పటికే తెగ విసిగించేసాడు. ఈ నేపథ్యంలో మెహబూబా అంటూ కొడుకుతో మొదలు పెడుతున్న సినిమా కొత్తగా వుంటుందనే నమ్మకాలైతే లేవు.

టెంపర్‌ చిత్రానికి వక్కంతం వంశీ కథ తీసుకున్నట్టు ఈసారి కూడా పూరి ఎవరిదైనా రచయిత సాయం కోరుతున్నాడా? తన లోపం ఎక్కడుందో గ్రహించి దానిని సరిదిద్దుకుని కొడుకు సినిమాతోనే తిరిగి తన గత వైభవం సాధించబోతున్నాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు