‘స్పైడర్’ బయ్యర్లు నిండా మునిగినట్లే

‘స్పైడర్’ బయ్యర్లు నిండా మునిగినట్లే

తొలి రోజు అంచనాలకు తగ్గట్లు లేని ‘స్పైడర్’ వసూళ్లు చూసి.. పండగ సీజన్ కదా తర్వాత పుంజుకుంటుందిలే అనుకున్నారు. కానీ పుంజుకోవడం సంగతలా ఉంచితే కలెక్షన్లు స్టడీగా కూడా సాగలేదు. రెండో రోజే వసూళ్లు పడిపోగా.. మూడో రోజుకు మరింత డ్రాప్ కనిపించింది. ఊహించని విధంగా మూడో రోజు ‘స్పైడర్’ తెలుగు వెర్షన్ షేర్ రూ.3 కోట్లు కూడా దాటలేదు. తెలుగు రాష్ట్రాల వరకైతే శుక్రవారం ‘స్పైడర్’ 2.23 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.

రెండో రోజు ఈ చిత్రానికి ఏపీ, తెలంగాణల్లో కలిపి రూ.4.52 కోట్ల షేర్ వచ్చింది. తొలి రోజు ఈ చిత్రం రూ.16.11 కోట్ల షేర్ వసూలు చేసింది. దీన్ని బట్టి ఈ సినిమా ఎలా పడిపోతూ వస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏరియాలోనూ ‘స్పైడర్’ వసూళ్లు చాలా నామమాత్రంగా వచ్చాయి మూడో రోజు. మరి శని, ఆది వారాల్లో అయినా వసూళ్లేమైనా మెరుగవుతాయేమో చూడాలి.

అమెరికా ప్రిమియర్లతో కలిపి తొలి రోజే మిలియన్ డాలర్లు వసూలు చేసిన ‘స్పైడర్’ అక్కడ కూడా తర్వాతి రోజుకు దబేల్‌మని పడింది. వీకెండ్లో కొత్త సినిమాలు అత్యధిక వసూళ్లు అందుకునే శనివారం రోజు ఈ చిత్రం అక్కడ లక్ష డాలర్ల లోపే వసూలు చేసింది. మహేష్ స్టామినా ప్రకారం చూస్తే ఇవి చాలా తక్కువ వసూళ్లే.

యుఎస్ బయ్యర్ ఈ చిత్రంపై రూ.15.5 కోట్ల పెట్టుబడి పెట్టాడు. అంటే ఈ చిత్రం 3 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయాలి. కానీ 1.3 మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.70 కోట్లకు బిజినెస్ జరిగితే ఇప్పటికి రూ.23 కోట్ల లోపే షేర్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే ‘బ్రహ్మోత్సవం’కు ఏమాత్రం తగ్గని డిజాస్టర్ అయ్యేలా కనిపిస్తోంది ‘స్పైడర్’.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు