సంచ‌ల‌నం: ట్రావెల్స్ బ‌స్సులో `స్పైడ‌ర్‌`

సంచ‌ల‌నం: ట్రావెల్స్ బ‌స్సులో `స్పైడ‌ర్‌`

మూవీ ఇండ‌స్ట్రీని కుదిపేస్తున్న పైర‌సీ బాగోతం ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. దీనిని అరిక‌ట్టేందుకు ఇప్ప‌టికి ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా, ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తున్నా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. తాజాగా నిన్న‌గాక మొన్న విడుద‌లైన ప్రిన్స్  మహేష్‌బాబు నటించిన ‘స్పైడర్‌’ చిత్రాన్ని ఓ ప్రైవేటు బస్సులో ప్రదర్శించడం కలకలం రేపింది. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న వెంకటరమణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో పెవ్‌డ్రైవ్‌ ద్వారా స్రైడర్‌ సినిమాను ప్రదర్శించారు.

సాధార‌ణంగా దూర ప్రాంతాల‌కు వెళ్లే బ‌స్సుల్లో సినిమాలు ప్ర‌ద‌ర్శించ‌డం కామ‌నే. అయితే, ప్రిన్స్ నుంచి తాజాగా రిలీజైన స్పైడ‌ర్‌ను ఈ బ‌స్సులో ప్ర‌ద‌ర్శించ‌డం తీవ్ర వివాదానికి దారితీసింది. పైర‌సీ భూతానికి అడ్డు అదుపులేకుండా పోతోంద‌న‌డానికి ఈ ఉదంత‌మే ఉదాహ‌ర‌ణ అని అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌డ‌మే కాకుండా కొన్ని నెల‌ల పాటు  అనే ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని చిత్రాల‌ను రూపొందిస్తుంటే.. ఇలా పైర‌సీమా ర్కెట్ విజృంభించి ఆ సినిమాల‌ను ఇలాలీక్ చేయ‌డంతో మూవీ ఇండ‌స్ట్రీ మొత్తంగా కుదేల‌వుతోంది.

తాజా ఘ‌ట‌న‌లో బ‌స్సులో స్పైడ‌ర్ ప్లే అవ్వ‌డం చూసిన ఓ ప్రయాణికుడు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు గుంటూరులోని గన్నవరం గాంధీ బొమ్మ కూడలి వద్ద జాతీయ రహదారిపై బస్సును ఆపి తనిఖీ చేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపించివేసి బస్సును గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే, దీని సూత్ర‌ధారులు బ‌య‌ట‌ప‌డ‌తారా? అనేది ఇప్పుడు నూరు డాల‌ర్ల ప్ర‌శ్న‌. గ‌తంలో బాహుబ‌లి వంటి మూవీలు సైతం పైర‌సీ భూతానికి బ‌లైన‌వే. మ‌రి ఎప్ప‌టికి ఈభూతానికి అడ్డుక‌ట్ట ప‌డుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు