బాహుబలి నిర్మాతలు శంకర్‌కు నో చెప్పారా?

బాహుబలి నిర్మాతలు శంకర్‌కు నో చెప్పారా?

‘భారతీయుడు’ సీక్వెల్ విషయంలో అధికారిక సమాచారం వచ్చేసింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ‘2.0’ విడుదలైన కొన్ని నెలలకే ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు శంకర్. కమల్ హాసనే కథానాయకుడు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కే ‘భారతీయుడు-2’ను మూడు భాషల్లోనూ మన దిల్ రాజే నిర్మించబోతున్నాడు.

విజయ దశమి సందర్భంగా రాజు.. శంకర్, కమల్ హాసన్‌లను కలిసిన ఫొటోను కూడా మీడియాకు వదిలారు. దీంతో ఈ ప్రాజెక్టు పక్కా అని తేలిపోయింది. శంకర్ ఏరి కోరి దిల్ రాజు నిర్మాణంలోనే మూడు భాషల్లోనూ ఈ చిత్రాన్ని చేయడానికి సిద్ధపడటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

నిజానికి ‘భారతీయుడు’ నిర్మాత ఎ.ఎం.రత్నమే సీక్వెల్ కూడా ప్రొడ్యూస్ చేయాలని ఆశపడ్డారు. ఈ మేరకు ఇంతకుముందే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ శంకర్ ఆయనతో పని చేయడానికి ఆసక్తి చూపించలేదు. భారీ స్థాయిలో తెరకెక్కించాలనుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు జోరుమీదున్న పెద్ద నిర్మాతలతోనే సినిమా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో శంకర్ ముందుగా ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలను సంప్రదంచినట్లు సమాచారం. కానీ వాళ్లిద్దరూ ఈ సినిమాను నిర్మించడానికి ఆసక్తి చూపించలేదట. దీంతో దిల్ రాజును అడగ్గా.. ఆయన ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఖర్చుకు వెనుకాడకుండా కొంచెం పెద్ద స్థాయిలోనే ఈ సినిమా చేయడానికి రాజు ఓకే చెప్పినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు