మ‌గ‌ధీర‌-2 ను చెక్క‌నున్న జ‌క్క‌న్న‌?

మ‌గ‌ధీర‌-2 ను చెక్క‌నున్న జ‌క్క‌న్న‌?

బాహుబ‌లి త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి త‌ర్వాతి సినిమాపై చాలా ఊహాగానాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ తో రాజ‌మౌళి త‌ర్వాత సినిమా చేయ‌బోతున్నార‌ని పుకార్లు కూడా వ‌చ్చాయి. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌మౌళి అఫీషియ‌ల్ గా త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎటువంటి అనౌన్స్ మెంట్ చేయ‌లేదు. తాజాగా, మెగా హీరోతో జ‌క్క‌న్న త‌ర్వాతి సినిమా చేయ‌బోతున్నాడ‌నే వార్త టాలీవుడ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ‘మగధీర’ కు సీక్వెల్ ను జ‌క్క‌న్న ప్లాన్ చేస్తున్నాడ‌ని వినికిడి.

జ‌క్క‌న్న‌, రామ్ చ‌ర‌ణ్‌ ల కాంబోలో వ‌చ్చిన‌ ‘మగధీర’ టాలీవుడ్ లో ఎన్ని రికార్డులు నెలకొల్పిందో తెలిసిందే. ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు సీక్వెల్ ను తీయాల‌ని జ‌క్క‌న్న అనుకుంటున్నాడ‌ట‌. కొద్ది రోజుల క్రితం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా 'మగధీర' కు సీక్వెల్ తీయాలనుందని అన్నారు. కొద్ది రోజుల క్రితం రంగ‌స్థలం 1985 సెట్ కు రాజ‌మౌళి వెళ్లారు. మ‌గ‌ధీర‌-2 గురించి చ‌ర‌ణ్ తో కూడా జ‌క్క‌న్న సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడ‌నే టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి త‌ర్వాతి సినిమా 'మగధీర-2' అని టాలీవుడ్ లో పుకార్లు వ‌స్తున్నాయి. ఆల్రెడీ బాహుబ‌లి వంటి హిస్టారిక‌ల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న మూవీని తీసిన జ‌క్క‌న్న వెంట‌నే అదే త‌ర‌హా సినిమా తీయ‌క‌వ‌పోచ్చ‌ని టాక్ ఉంది. ఒక వేళ మ‌గ‌ధీర‌-2 కాక‌పోయినా, ఈ జ‌క్క‌న్న‌ తరువాతి ప్రాజెక్టు రాంచరణ్ తోనే చేయ‌బోతున్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు