కోదండరామా!ఆయనెవరు?: కేసీఆర్‌

కోదండరామా!ఆయనెవరు?: కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇన్నాళ్ల‌పాటు వ‌హించిన మౌనం వీడారు. స్వ‌రాష్ట్ర ఉద్య‌మంలో కేసీఆర్‌తో క‌లిసి సాగిన జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాంకు, గులాబీ ద‌ళ‌ప‌తికి మ‌ధ్య ప్రారంభ‌మైన‌ పొర‌పొచ్చాలు....గ‌త కొద్దికాలంగా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థితికి చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అడ‌పాద‌డ‌పా పార్టీ నేత‌లు జేఏసీ చైర్మ‌న్‌పై స్పందిస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ నేరుగా ఎప్పుడు స్పందించ‌లేదు. కానీ తాజాగా రియాక్ట‌య్యారు. అది కూడా అలా ఇలా కాదు...ఏకంగా విరుచుకుప‌డ్డారు. ``కోదండరామా...ఆయనెవరు? తాడూ బొంగరం లేనోళ్లు ఏదేదో మాట్లాడతారు. అవన్నీ వింటూ కూర్చుంటామా? మే చెప్పింది చేస్తాం... `` అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రియాక్ట‌య్యారు.

సింగ‌రేణి ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన నేపథ్యంలో స్వ‌యంగా సీఎం కేసీఆర్ ఎంట్రీ ఇచ్చి కార్మికుల ఓట్ల కోసం పార్టీ కార్యాల‌యమైన తెలంగాణ‌భ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.  ప్రతిపక్షపార్టీలు తలకిందులుగా తపస్సు చేసినా సింగరేణి ఎన్నికల్లో తమ పార్టీ అనుబంధ కార్మిక సంఘమే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు సింగరేణి సంస్థ, అందులోని ఉద్యోగులను పట్టించుకోలేదన్నారు. 2002లో సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల రద్దు ప్రక్రియపై జాతీయ సంఘాలు సంతకాలు చేశాయని, వారసత్వ ఉద్యోగాలు పోవడానికి వారే కారణమని చెప్పారు. తమ ప్రభుత్వం ఏ పనులు చేపట్టినా అడ్డుకునేందుకు న్యాయవాదులతో కూడిన ఒక మూఠా ఏర్పడిందని, ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి పనిని అడ్డుకునేందుకు ప్రయత్ననిస్తున్నారని సీఎం కేసీఆర్ మండి పడ్డారు. విపక్షాలు తమపై ఎంత దుష్పప్రచారం చేసినా సింగరేణిలో 11 డివిజన్లలో తామే విజయం సాధిస్తామన్నారు. సింగరేణి ఎన్నికల్లో అధికారపార్టీ అవకతవకలకు పాల్పడుతోందని జేఏసీ చైర్మెన్‌ కోదండరామ్‌ చెప్తున్నారని ఓ విలేకరి ప్రస్తావించగా సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందిస్తూ...కోదండరం తాడూ బొంగ‌రం లేని వ్య‌క్త‌ని మండిప‌డ్డారు.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని, వాటి స్థానంలో కారుణ్య నియామకాలు చేపడుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. కారుణ్య నియామకాల కింద ఉద్యోగం వద్దనుకున్న వారికి రూ.25లక్షల నగదు చెల్లిస్తామని...ఇది వద్దనుకుంటే కార్మికుడికి ఉద్యోగ విరమణ వయసు వచ్చేంతవరకు నెలకు రూ.25వేల వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. ఇది గని లోపల పని చేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. 1980 నుంచి సింగరేణిలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు. తమ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగా లను పునరుద్ధరిస్తే.. జాతీయ సంఘాలన్ని కలిసి కోర్టుకు వెళ్లి అడుకున్నాయని, విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొటివేస్తే ఆ సంఘాల నాయకులు స్వీట్లు పంచుకున్నారని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English