మెగా హీరోని దించండి బాబోయ్‌!

మెగా హీరోని దించండి బాబోయ్‌!

నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ హీరో కావడానికి సకల సన్నద్ధుడై ఉన్నప్పటికీ అతని వెండితెర ప్రవేశం ఎందుచేతనో ఆలస్యమవుతోంది. ఏ డైరెక్టర్‌ని అయినా తన కొడుకుని పరిచయం చేయడానికి ఒప్పించగలవాడై ఉండీ, తనే స్వయంగా సినిమా తీసి విడుదల చేసుకోగల సత్తా ఉండీ తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి నాగబాబు ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు? వరుణ్‌తేజ్‌ని చూస్తున్న వారంతా ముందుగా ఇతడిని హీరోని చేయాలని, మెగా కుటంబానికి చెందిన కుర్రాళ్లలో ఇతనికంటే బెస్ట్‌ లుక్స్‌ ఉన్నవాడు లేడని అంటున్నారు. వరుణ్‌తేజ్‌ హీరో అయితే మాత్రం కొత్తగా వచ్చే కుర్రాళ్లతో పాటు తన ఫ్యామిలీ హీరోలకి కూడా గట్టి పోటీదారుడవుతాడనడంలో సందేహం అక్కర్లేదు.

ఇంకా హీరోగా పరిచయం కాకముందే వరుణ్‌తేజ్‌కి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో ఫాన్‌ క్లబ్స్‌ కూడా ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ఇతను క్లిక్‌ అవుతాడని, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఎంతోమంది బరిలో ఉన్నా వరుణ్‌ కూడా సత్తా చాటుకుంటాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అతడిని త్వరగా దించమని గోల పెడుతున్నారు. వరుణ్‌తేజ్‌ పరిచయం ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తూనే ఉన్నారు. ఇంతవరకు అతని తొలి సినిమా దర్శకుడు ఎవరనేది అధికారికంగా తేలలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు