జవాన్.. ఆ రోజు బయటికొస్తాడు

జవాన్.. ఆ రోజు బయటికొస్తాడు

సాయిధరమ్ తేజ్  కొత్త సినిమా ‘జవాన్’ను ఎప్పుడో ఆగస్టులోనే రిలీజ్ చేయాలనుకున్నారు. తర్వాత అది సెప్టెంబరు 1కి వాయిదా పడింది. ఈ తేదీకి సినిమా రావడం పక్కా అనుకుంటుండగా.. నందమూరి బాలకృష్ణ సినిమా ‘పైసా వసూల్’ అనుకోకుండా ఆ డేటుకు ఫిక్సవడంతో దీన్ని వాయిదా వేశారు.

మరోవైపు కొంతమేర రీషూట్లు కూడా చేయాల్సి ఉండటంతో సినిమా మరింత వాయిదా పడింది. సెప్టెంబరు 1క4 అనుకున్న సినిమాను అక్టోబరంతా కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఐతే ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీ మీద ఓ క్లారిటీ వచ్చింది. నవంబరు 3న ‘జవాన్’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ముందు అక్టోబరు నెలాఖర్లోనే ‘జవాన్’ను రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. చివరి వీకెండ్లో ఆల్రెడీ రామ్ సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’.. గోపీచంద్ మూవీ ‘ఆక్సిజన్’ షెడ్యూల్ అయి ఉన్నాయి. అందుకే నవంబరు 3కు ఫిక్సయ్యారు. నవంబర్లో అసలు ఓ మోస్తరు సినిమాలు కూడా ఏవీ వచ్చేలా లేవు. చెప్పుకోదగ్గ సినిమా అంటే ‘జవాన్’ అయ్యేలా ఉంది.

నవంబరు 3కు ఆల్రెడీ ఓ చిన్న సినిమా షెడ్యూల్ అయి ఉంది. ఆది హీరోగా ప్రభాకర్ డైరెక్ట్ చేసిన ‘నెక్స్ట్ నువ్వే’ అదే తేదీకి వస్తుంది. అది పెద్ద పోటీ కాదని భావించి ‘జవాన్’ను రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణతో కొత్త నిర్మాత కృష్ణ నిర్మించిన ‘జవాన్’కు రైటర్ టర్న్డ్ డైరెక్టర్ బీవీఎస్ రవి దర్శకత్వం వహించాడు. తేజు సరసన మెహ్రీన్ నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు