రెండాకుల గుర్తును ఏం చేస్తారు?

రెండాకుల గుర్తును ఏం చేస్తారు?

తమిళనాట అన్నాడీఎంకె పార్టీకి చెందిన రెండాకుల గుర్తు ఎవ‌రికి చెందాలనే విషయంలో ఈసీ అధికారులు ప్ర‌క్రియ‌ వేగ‌వంతం చేశారు. మద్రాసు హైకోర్టు సూచనలతో వారు ముందడుగు వేస్తున్నారు.  మరోవైపు అన్నాడిఎంకె చీలిక వ‌ర్గం నేత దిన‌క‌ర‌న్.. ఈసీకి డాక్యుమెంట్లు స‌మ‌ర్పించ‌డానికి మ‌రో 15 రోజుల వ్యవ‌ధి కావాల‌ని కోరగా ఈసీ తిర‌స్క‌రించింది.

శుక్రవారం సాయంత్రంలోగా సమర్పిస్తేనే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. దీనిపై అక్టోబ‌ర్ 6వ తేదీన విచార‌ణ జ‌ర‌గ‌నుంద‌ని దిన‌క‌ర‌న్‌కు స్ప‌ష్టం చేసింది. మ‌ద్రాసు హైకోర్టుకి చెందిన మ‌ధురై బెంచ్ ఆదేశాల అనుసారం ఈ కేసును అక్టోబ‌ర్ 31లోగా ముగించాల‌ని… అందుకే దిన‌క‌ర‌న్‌కు గ‌డువును పెంచలేదని ఈసీ అంటోంది.
   
కాగా ప‌న్నీరు సెల్వం, ప‌ళ‌ణి స్వామి వ‌ర్గం అన్నాడిఎంకె పార్టీ గుర్త‌యిన రెండాకుల గుర్తు, పార్టీపేరు త‌మ‌కే చెందాలంటూ తమ వాదనను ఈసీ ముందు వినిపించారు. దినకరణ్ కూడా అదే గుర్తు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
   
పన్నీర్, పళని వర్గాలు ఏకమైపోయిన తరువాత శ‌శిక‌ళ‌ను పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి నుంచి తొల‌గించడం తెలిసిందే. దీన్ని వ్య‌తిరేకించిన దిన‌క‌ర‌న్ హైకోర్టును ఆశ్ర‌యించారు. హైకోర్టు ఎన్నిక‌ల సంఘం ద్వారా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని భావించి.. ఈసీ కోర్టుకి బంతిని పంపించి పలు సూచనలు చేసింది. మరి ఈసీ అనుగ్రహం ఎవరికి ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English