అంత పెద్ద హీరోలతో పోటీ లేదు

అంత పెద్ద హీరోలతో పోటీ లేదు

టాప్‌ హీరోల సినిమాలతో పాటుగా తన చిత్రాలు విడుదల చేస్తున్నాడని శర్వానంద్‌పై ఒక కంప్లయింట్‌ వుంది. ప్రతిసారీ పెద్ద చిత్రాలతో ఢీకొని వాటికి నెగెటివ్‌ టాక్‌ వస్తే తన సినిమాలు నడిచిపోతున్నాయని అనేవాళ్లున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రాజా, శతమానం భవతి చిత్రాలను మంచి పోటీలో విడుదల చేసి హిట్లు కొట్టాడు శర్వానంద్‌.

మళ్లీ ఇప్పుడు జై లవకుశ, స్పైడర్‌కి పోటీగా అతని సినిమా మహానుభావుడు రిలీజ్‌ అయింది. ఈ చిత్రంలో శర్వానంద్‌ అతి శుభ్రమున్న యువకుడి పాత్ర పోషించాడు. పెద్ద హీరోలతో ప్రతిసారీ పోటీకి ఎందుకు వెళుతున్నావని అడిగితే, అసలు తాను కాంపిటీషన్‌కి వెళ్లనని, తన సినిమా ఎప్పుడు రిలీజ్‌ అయ్యేదీ డిసైడ్‌ చేసేది తన నిర్మాతలేనని, ఆ విషయాలని అసలు పట్టించుకోనని అంటున్నాడు.

ఇలా పెద్ద సినిమాలతో పాటు పండగ టైమ్‌లో విడుదల చేయడం స్ట్రాటజీ అని, బాగుందనే టాక్‌ వస్తే పండగ టైమ్‌లో రెండు సినిమాల కంటే ఎక్కువే ఆదరిస్తారు కనుక తన నిర్మాతలు క్యాలిక్యులేటెడ్‌గా వ్యవహరిస్తున్నారని, అంతే తప్ప అంత పెద్ద హీరోల చిత్రాలతో పోటీ పడాలని అనుకోనని, అసలు తాను వారికి కాంపిటీషనే కాదని వినమ్రంగా చెప్పేసాడు.

శర్వానంద్‌ ఇంత మామూలుగా దీని గురించి మాట్లాడేసాడు కానీ హీరోగా అతని రేంజ్‌ ఎంత పెరుగుతోందనేది తన చిత్రాలకి వస్తోన్న ఓపెనింగ్సే చెబుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు