బాక్సాఫీస్‌ బద్దలు, హీరో జైలు పాలు!

బాక్సాఫీస్‌ బద్దలు, హీరో జైలు పాలు!

నటి భావన కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా పోలీస్‌ కస్టడీలో వున్న మలయాళ హీరో దిలీప్‌కి కోర్టు బెయిల్‌ నిరాకరిస్తోంది. ఈ కేసులో దిలీప్‌ అరెస్ట్‌ అయిన తర్వాత అటు అతనికి వ్యతిరేకంగా, మరోవైపు అనుకూలంగా చాలా మంది మాట్లాడారు. అతని అభిమానులైతే దిలీప్‌కి కష్టకాలంలో వెన్నంటి వుంటున్నారు.

ఈ నేపథ్యంలో కొత్తగా విడుదలైన అతని సినిమా 'రామలీల' కేరళ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో దిలీప్‌ ప్రస్తుతం తను ఎదుర్కొంటున్న పరిస్థితులని ప్రతిబింబించే పాత్ర పోషించాడు. ప్రతీకారంతో ఒక వ్యక్తిని హత్య చేసి హీరో జైలు పాలవుతాడు.

అయితే తనని అన్యాయంగా అరెస్ట్‌ చేసారని, పోలీసుల దగ్గర ఆధారాలు లేవని వాదిస్తాడు. కానీ చివరకు హీరోనే ప్రతీకారం కోసం హత్య చేసాడని తెలుస్తుంది. ఇందులో డైలాగులు, కోర్టు విచారణ, ఇతివృత్తం అన్నీ దిలీప్‌ జీవితంతో ముడిపడి వుండడంతో రామలీలతో మరింతగా రిలేట్‌ అవుతున్నారు.

అన్ని చోట్ల హౌస్‌ఫుల్‌ కలక్షన్లతో నడుస్తోన్న ఈ చిత్రం నిజ జీవితంలో జరిగే సంఘటనలకి, సినిమాకీ సంబంధం లేదని, సినిమా బాగుంటే ఎవరిదైనా జనం ఎగబడి చూస్తారని అర్థమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు