స్పైడర్‌ అక్కడ ఎక్కింది... ఎందుకంటే?

స్పైడర్‌ అక్కడ ఎక్కింది... ఎందుకంటే?

మహేష్‌ స్పైడర్‌ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. తొలి రోజు రికార్డులు బద్దలు కొట్టలేకపోయిన ఈ చిత్రం రెండవ రోజు కూడా నిరాశాజనకంగానే పర్‌ఫార్మ్‌ చేసింది. తెలుగు వెర్షన్‌ సంగతి ఇలా వుంటే, తమిళంలో మాత్రం స్పైడర్‌ పర్‌ఫార్మెన్స్‌ బాగుంది.

ఒక తెలుగు హీరో చేసిన సినిమాకి వస్తోన్న వసూళ్లు చాలా బాగున్నాయని అక్కడి ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. అలాగే స్పైడర్‌కి తమిళ విమర్శకులు మంచి మార్కులు వేస్తున్నారు. తెలుగులో పాపులర్‌ క్రిటిక్స్‌ అంతా ఫ్లాప్‌ అని తేల్చేసిన ఈ చిత్రానికి తమిళం నుంచి ఎందుకు పాజిటివ్‌ స్పందన వస్తున్నట్టు? ఒక సూపర్‌స్టార్‌తో తీసే సినిమాలా కాకుండా ఒక యువ హీరోతో తీసే చిత్రంలా మురుగదాస్‌ దీనిని తీర్చిదిద్దాడు.

విలన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చి హీరోని అంతగా ఎలివేట్‌ చేయలేదు. తమిళంలో మహేష్‌కి ఎలాంటి ఇమేజ్‌ లేకపోవడంతో స్టార్‌ హీరో సినిమాలా వారు దీనిని చూడడం లేదు. కానీ తెలుగులో మాత్రం మహేష్‌ అభిమానులే దీంతో నీరుగారిపోయారు.

హీరోయిజం బాగా చూపిస్తాడని పేరున్న మురుగదాస్‌ ఇలా విలన్‌ మీద సినిమా తీసి అందులో మహేష్‌ని డమ్మీ చేసేసరికి అభిమానులు కూడా మురుగదాస్‌ని తిట్టేస్తున్నారు. కేవలం తమిళం కోసం ఈ చిత్రం తీసి తెలుగులోకి అనువదించినట్టయితే మనవాళ్లనుంచి బెటర్‌ రెస్పాన్స్‌ వచ్చేదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు