బాలీవుడ్లో భలే కాంబినేషన్

బాలీవుడ్లో భలే కాంబినేషన్

ఇండియాలో మల్టీస్టారర్ సినిమాలు తీయడంలో బాలీవుడ్ వాళ్ల తర్వాతే ఎవరైనా. తెలుగులో గత కొన్నేళ్ల నుంచి మల్టీస్టారర్లు ఊపందుకున్నాయి కానీ.. అంతకుముందు దాదాపు మూడు దశాబ్దాల నుంచి మల్టీస్టారర్ల ఊసే లేదు. కానీ బాలీవుడ్లో మాత్రం మల్టీస్టారర్లు ఎప్పుడూ ఢోకా లేదు. అమితాబ్ బచ్చన్.. అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. హృతిక్ రోషన్.. అక్షయ్ కుమార్.. ఇలా సూపర్ స్టార్లందరూ మల్టీస్టారర్లలో నటించిన వాళ్లే. ఐతే ఈ మధ్య కొంచెం మల్టీస్టారర్ల జోరు తగ్గింది. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికర మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. ‘యశ్ రాజ్ ఫిలిమ్స్’ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ సినిమాకు శ్రీకారం చుడుతోంది.

బాలీవుడ్ సీనియర్ స్టార్ హృతిక్ రోషన్.. యంగ్ సెన్సేషన్ టైగర్ ష్రాఫ్ కలయికలో ఈ సినిమా తెరకెక్కనుంది. వీళ్లిద్దరి కలయిక ఆసక్తి రేకెత్తించేదే. ఈ కాంబినేషన్ ఎవరూ ఊహించనిదే. ఇది ఒక యాక్షన్ సినిమా అని అంటున్నారు. ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిన వీళ్లిద్దరూ అదిరిపోయే బాడీలతో తెరమీద చేసే విన్యాసాల కోసం హిందీ సినిమా ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిట్నెస్, డ్యాన్సుల విషయంలో హృతిక్‌కు తాను ఏకలవ్య శిష్యుడినని అంటుంటాడు టైగర్. హృతిక్ లాగే చిజిల్ బాడీని బిల్డ్ చేయడమే కాదు.. డ్యాన్సులు కూడా ఇరగదీస్తుంటాడు టైగర్. ‘బ్యాగ్ బ్యాంగ్’ ఫేమ్ సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. హృతిక్ ఈ ఏడాది ‘కాబిల్’ లాంటి హిట్ మూవీలో నటిస్తే.. టైగర్ నుంచి వచ్చిన ‘మున్నా మైకేల్’ మాత్రం తేడా కొట్టేసింది. మరి వీళ్లిద్దరి కలయికలో రాబోయే సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు