ఎన్టీఆర్ క్యాష్ చేసుకోగలడా?

ఎన్టీఆర్ క్యాష్ చేసుకోగలడా?

మొత్తానికి దసరా సీజన్లో రెండో భారీ సినిమా కూడా రేసులోకి దిగేసింది. నిన్ననే మహేష్ బాబు మూవీ ‘స్పైడర్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘జై లవకుశ’లో కంటెంట్ వీక్ అయినప్పటికీ ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ మీదే ఓ మోస్తరుగా ఆడేసింది. ఐతే ‘స్పైడర్’ పరిస్థితి అలా ఉండదని.. ఇందులో కంటెంట్ బలంగా ఉంటుందని.. కాబట్టి పక్కాగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు.

కానీ తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. కలెక్షన్లు కూడా ఓ మోస్తరుగా ఉన్నాయంతే. చివరికి ఎలాంటి పలితం వస్తుందన్నది ఇప్పుడు చెప్పలేం కానీ.. బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలైతే లేనట్లే.

‘స్పైడర్’ రంగంలోకి దిగుతుండటంతో ‘జై లవకుశ’పై మంగళవారం నుంచే ప్రభావం పడింది. వీకెండ్లోనే కొంచెం వీక్ అయిన ఈ చిత్రం సోమవారం నుంచి చాలా నామమాత్రంగా వసూళ్లు రాబట్టింది. మంగళవారం నుంచే ‘స్పైడర్’ హంగామా మొదలైంది. యుఎస్‌తో పాటు ఇక్కడ కూడా ముందు రోజు రాత్రే హడావుడి కనిపించింది. దీంతో ‘జై లవకుశ’కు మంగళవారం మరీ పేలవమైన వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ వీకెండ్లో ఈ చిత్రం 54 కోట్లు మాత్రమే షేర్ రాబట్టడం.. సోమ, మంగళవారాల్లో వసూళ్లు నామమాత్రంగా ఉండటంతో ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.60 కోట్ల షేర్ మార్కును దాటితే గొప్ప అన్నారు.

ఐతే ‘స్పైడర్’కు డివైడ్ టాక్ రావడం ‘జై లవకుశ’కు కొంత ఉపశమనాన్నిచ్చినట్లే కనిపిస్తోంది. బుధవారం ఉదయం డల్లుగా నడిచిన ‘జై లవకుశ’ సాయంత్రానికి పుంజుకుంది. గురువారం కూడా వసూళ్లు బాగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఐతే ‘స్పైడర్’ వల్ల ‘జై లవకుశ’కు కలిగిన అడ్వాంటేజీని శుక్రవారం రాబోతున్న ‘మహానుభావుడు’ లాగేసుకుంటుందేమో అన్న సందేహాలున్నాయి. ఆ సినిమాపై సూపర్ పాజిటివ్ బజ్ ఉంది. ఆ సినిమాకు టాక్ తేడాగా వస్తేనే ‘జై లవకుశ’ క్యాష్ చేసుకోగలదు. లేదంటే ఆ సినిమాకు భారీ నష్టాలు తప్పవేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు