మల్లు హీరోయిన్ని రఫ్ఫాడుకున్నారు

మల్లు హీరోయిన్ని రఫ్ఫాడుకున్నారు

కొన్నేళ్ల కిందటి ‘కొలవరి’ పాట తర్వాత సోషల్ మీడియాను ఆ స్థాయిలో ఊపేస్తున్నా పాట.. జిమ్మికి కమ్మల్.  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ‘వెలిపడింటే పుస్తకం’ సినిమాలోని ఈ పాట గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన అన్నా రాజన్ అలియాస్ లిచీ కూడా బాగానే ఫేమస్ అయింది.

ఆమెకు చాలానే అవకాశాలు వస్తున్నాయిప్పుడు. ఐతే ఓ మీడియా ఇంటర్వ్యూ సందర్భంగా అన్నా రాజన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. మోహన్ లాల్‌తో నటించారు.. ఇక మమ్ముట్టితో, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్‌తో ఎప్పుడు నటిస్తారు అని అడిగిన ప్రశ్నకు అన్నా రాజన్ చెప్పిన సమాధానం వివాదాస్పదమైంది.

తాను దుల్కర్ సల్మాన్‌కు జోడీగా నటిస్తే.. అతడికి తండ్రిగా మమ్ముట్టి నటించాలని అన్నా రాజన్ అన్నట్లుగా ఆ ఇంటర్వ్యూ ప్రోమో కట్ చేసి వదలగా.. ఇది చూసి మమ్ముట్టి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. మమ్ముట్టికి జోడీగా నటించనందని.. ఆయన్ని పెద్ద వయస్కుడిగా పేర్కొందని అంటూ అన్నా రాజన్ మీద ఫైర్ అయిపోయారు ఫ్యాన్స్. దీంతో ఈ అమ్మాయి బెంబేలెత్తిపోయింది.

తనను మమ్ముట్టి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టార్గెట్ చేసుకోవడం వివరణ ఇస్తూ ఒక వీడియో పెట్టిందామె. అందులో ఆమె కన్నీళ్లతో సమాధానం చెప్పడం విశేషం. తాను అన్న మాట వేరని.. దాన్ని మధ్యలో కట్ చేసి ఆ ఇంటర్వ్యూ ప్రోమో వదిలారని.. దీంతో తనను మమ్ముట్టి ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె చెప్పింది. తాను మమ్ముట్టికి జోడీగా నటించనని అనలేదని ఆమె వివరణ ఇచ్చింది. ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే క్షమించాలని కోరింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English