ఒక్క సినిమాకు 7 వేల కోట్ల బడ్జెటా?

ఒక్క సినిమాకు 7 వేల కోట్ల బడ్జెటా?

ప్రపంచ సినిమా మార్కెట్ ఎంతగా విస్తరించినప్పటికీ.. ఓ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కూడా వెయ్యి కోట్లు దాటితే ఔరా అనే అనుకుంటున్నాం. ఐతే ఇప్పుడో సినిమా ఏకంగా రూ.7000 కోట్ల దాకా ఖర్చుతో తెరకెక్కుతోంది. ఆ సినిమా మరేదో కాదు.. అవతార్-2. ఎనిమిదేళ్ల కిందట ‘అవతార్’ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.

వేల కోట్ల కలెక్షన్లతో ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అది రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు సీక్వెల్స్ తీయడానికి దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్ సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ సీక్వెళ్లలో మొదటిది.. 2020 డిసెంబరు 18న విడుదవుతుంది. ఈ చిత్రానికి ఏకంగా బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. అంటే రూపాయల్లో చెప్పాలంటే దాదాపు ఏడు వేల కోట్లన్నమాట. మరీ ఈ స్థాయిలో ఖర్చు పెట్టి ఏం సినిమా చేస్తారో చూడాలి. అవతార్-2 అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. బడ్జెట్ మీద మూణ్నాలుగు రెట్లు వసూళ్లు వస్తాయి.

ఎందుకంటే అవతార్ తొలి భాగం అప్పట్లోనే ఏకంగా 2.788 బిలియన్ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ సినిమా బడ్జెట్ దాదాపు రెండు వేల కోట్లు. మరి రెండో భాగానికే బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారంటే అవతార్-3, 4, 5 సినిమాలకు ఎంత బడ్జెట్ పెడతారో. అవతార్-2 వచ్చిన ఏడాదికే అవతార్-3 రాబోతుండగా.. తర్వాతి రెండు భాగాలు 2024, 2025లో విడుదలవుతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు