'చిరంజీవితో సినిమాకు భయపడ్డా'

'చిరంజీవితో సినిమాకు భయపడ్డా'

దక్షిణాది సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో మురుగదాస్ ఒకడు. ఒక రమణ.. ఒక గజిని.. ఒక తుపాకి.. ఒక కత్తి.. ఇలా చెప్పుకుంటూ పోతే మురుగదాస్ కెరీర్లో మైలురాళ్లు ఎన్నో. ఐతే అంత గొప్ప దర్శకుడు తెలుగులో తీసిన సినిమా మాత్రం ప్రేక్షకులకు రుచించలేదు.

అదే.. స్టాలిన్. మురుగ తీసిన ‘రమణ’ సినిమాకు ఇంప్రెస్ అయ్యి దాని రీమేక్ లో నటించిన చిరు.. తర్వాత నేరుగా మురుగతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఐతే వీళ్లిద్దరి కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘స్టాలిన్’ నిరాశపరిచింది. అందులో మురుగదాస్ ముద్ర కనిపించనే లేదసలు. ఇప్పుడు ‘స్పైడర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మురుగదాస్ దగ్గర ‘స్టాలిన్’ గురించి ప్రస్తావిస్తే దాని గురించి మాట్లాడటానికి ఇబ్బంది పడ్డాడు.

తాను చిరంజీవిని సరిగా డీల్ చేయలేకపోయానని చెప్పాడు మురుగ. చిరంజీవితో సినిమా చేసే సమయానికి తనకు వయసు తక్కువ అని.. చిరు చాలా సీనియర్ కావడంతో ఆయన్ని డైరెక్ట్ చేయడానికి భయపడ్డానని.. చాలా నెర్వస్ గా అనిపించిందని మురుగదాస్ చెప్పాడు.  చిరు తనను కంఫర్టబుల్ గా ఉంచే ప్రయత్నం చేసినప్పటికీ.. తాను ‘స్టాలిన్’ విషయంలో ఇబ్బంది పడ్డానని అన్నాడు మురుగదాస్.

ఐతే మహేష్ బాబును డీల్ చేయడంలో తనకు అలాంటి ఇబ్బంది రాలేదన్నాడు. ఇప్పుడు తన వయసు పెరిగిందని, పరిణతి కూడా పెరిగిందని, పైగా మహేష్ బాబుతో ముందు నుంచే పరిచయం ఉండటం, వయసు దగ్గరగా ఉండటంతో తామిద్దరం చాలా ఈజీగా పని చేసుకువెళ్లామని మురుగదాస్ తెలిపాడు. ‘స్పైడర్’ విషయంలో తాను, మహేష్ మంచి సమన్వయంతో పని చేశామని అతనన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు