దిల్ రాజు మళ్లీ ఇరుక్కున్నాడే..

దిల్ రాజు మళ్లీ ఇరుక్కున్నాడే..

ఇప్పుడున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో కొంచెం నిజాయితీగా వ్యవహరిస్తూ.. సినిమాల ఫలితాల గురించి ఓపెన్ గా మాట్లాడతాడని దిల్ రాజుకు మంచి పేరుంది. ఐతే గతంలో దిల్ రాజు తన సినిమాలకు సంబంధించిన లెక్కలు చెప్పాల్సి వస్తే షేర్ల గురించి మాట్లాడేవాడు. కానీ ఈ మధ్య ఆయన కూడా తెలివిగా గ్రాస్ లెక్కలు పట్టుకొస్తున్నాడు. తన నిర్మాణంలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ బయ్యర్లకు దాదాపుగా అన్ని ఏరియాల్లో నష్టాలు మిగిల్చినప్పటికీ.. ఆయన ఆ సంగతి ఎత్తలేదు.

వంద కోట్ల గ్రాస్ అంటూ గొప్పలు పోయి విమర్శలెదుర్కొన్నాడు. సినిమాకు ఏ ఏరియాలో ఎంత బిజినెస్ జరిగింది.. ఎంత షేర్ వచ్చిందనే విషయాలు ఆయన ప్రస్తావించలేదు. ఎంతకు అమ్మారు... ఎంత షేర్ వచ్చిందని చెబితేనే ఒక సినిమా హిట్టా ఫ్లాపా అని తేలుతుంది. కానీ దిల్ రాజు ‘దువ్వాడ జగన్నాథం’ విషయంలో తెలివిగా ఆ వివరాల్ని విస్మరించాడు.

ఇప్పుడు తాను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘జై లవకుశ’ విషయంలోనూ ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్లో 18 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని.. ఎన్టీఆర్ గత సినిమా ‘జనతా గ్యారేజ్’తో పోలిస్తే 3 కోట్లు ఎక్కువ వసూలైందని అన్నాడు రాజు. ఐతే గ్రాస్ సంగతలా ఉంచితే.. ‘జై లవకుశ’ తొలి వారాంతంలో వచ్చిన షేర్ 12 కోట్ల లోపే. ఇంకా ఆరు కోట్ల దాకా షేర్ వస్తే తప్ప ఈ సినిమా సేఫ్ అవ్వదు.

ఇప్పుడున్న పరిస్థితిలో అది అసాధ్యంగానే కనిపిస్తోంది. కానీ రాజు మాత్రం సక్సెస్ మీట్లో గ్రాస్ లెక్కలతో ఈ సినిమాను గొప్పగా చూపించే ప్రయత్నం చేశాడు. ‘జనతా గ్యారేజ్’తో పోలిస్తే ఈ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. పైగా ఇప్పుడు దసరా సెలవులు నడుస్తున్నాయి. ఇక ‘జనతా గ్యారేజ్’ వీకెండ్ తర్వాత కూడా జోరు చూపించింది. కానీ ‘జై లవకుశ’ వీకెండ్లోనే డల్లయిపోయింది. ఈ విషయాలన్నీ రాజుకు తెలియనివా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు