విక్ర‌మ్ వేద‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు!

విక్ర‌మ్ వేద‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు!

విల‌క్ష‌ణ క‌థ‌ల‌ను తెర‌కెక్కంచ‌డంలో త‌మిళ ద‌ర్శ‌కులు ముందుంటారు. మంచి క‌థ‌, క‌థ‌నం ఉంటే ఆ సినిమాలో న‌టించేందుకు త‌మిళ‌ స్టార్ హీరోలు కూడా సిద్ధంగా ఉంటారు. ప్ర‌యోగాత్మ‌క సినిమాలను ఆద‌రించ‌డం త‌మిళ ప్రేక్ష‌కుల‌కు అల‌వాటే. అదే కోవ‌లో విజ‌య్ సేతుప‌తి, మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్రల్లో విక్రమ్ వేద‌ తెర‌కెక్కింది. ఏ మాత్రం అంచ‌నాలు లేకుండా విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. స్టార్ హీరోల సినిమాల‌కు దీటుగా ఈ సినిమా దాదాపు 60 కోట్లు వ‌సూలు చేసి నిర్మాత‌ల‌కు కాసుల పంట పండించింది. ఈ సూప‌ర్ హిట్ మూవీకి మ‌రో అరుదైన గౌరవం ద‌క్కింది. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ప్రతిష్టాత్మక 30వ టోక్యో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ లో విక్రమ్ వేద‌ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.ఈ చిత్రాన్ని టోక్యో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్ర‌ద‌ర్శించ‌నున్నార‌ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైనాట్ స్టూడియోస్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు మాధ‌వ‌న్ కూడా అవునంటూ రిప్లై ఇచ్చారు.

అక్టోబ‌ర్ 25 నుంచి న‌వంబ‌ర్ 3 వ‌ర‌కు జ‌ర‌గనున్న ఈ ఫెస్టివ‌ల్ లో విక్ర‌మ్ వేద చోటు ద‌క్కించుకుంది. పుష్క‌ర్-గాయ‌త్రి దంప‌తులు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం జూలైలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాలో మాధవన్ ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ గా న‌టించాడు. విజయ్ సేతుపతి నొటోరియ‌స్ గ్యాంగ్ స్టర్ గా నటించాడు. ఈ సినిమా కథా కథనాలతో పాటు క్లైమాక్స్ కూడా చాలా ఆస‌క్తిక‌రంగా చిత్రీక‌రించారు. విక్ర‌మార్కుడు, భేతాళుడి క‌థ‌ల‌ను బేస్ చేసుకొని ఈ చిత్ర క‌థ‌ను రూపొందిచార‌ని వినికిడి. అందుకే ఈ కథను అర్థాంతరంగా ముగించేశారు. దీంతో, దీనికి సీక్వెల్ నిర్మిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను  హిందీలో షారుక్ రీమేక్ చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. తెలుగులో బాబాయ్-అబ్బాయ్ అయిన వెంక‌టేష్, రాణాలు ఈ రీమేక్ లో న‌టిస్తున్నార‌ని టాక్ వ‌చ్చింది. అయితే, వెంక‌టేష్....గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టించేందుకు సుముఖంగా లేక‌పోవ‌డంతో ఆ అవ‌కాశం నాగార్జునకు ద‌క్కింద‌ని స‌మాచారం. అయితే, ఈ రీమేక్ ల గురించి ఎటువంటి అఫీషియ‌ల్ స్టేట్ మెంట్ విడుద‌ల కాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు