మహేష్‌కి, మిగతావాళ్లకీ తేడా అదే!

మహేష్‌కి, మిగతావాళ్లకీ తేడా అదే!

ఓవర్సీస్‌ మార్కెట్‌లో మహేష్‌ మకుటం లేని మహరాజు అనేది తెలిసిందే. బాహుబలి సినిమాలంటూ లేకపోతే అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం మహేష్‌దే. అందరికంటే ఎక్కువ మిలియన్‌ డాలర్‌ సినిమాలున్న మహేష్‌ చిత్రం వస్తుందంటే ఓవర్సీస్‌ బయ్యర్లకి చింత వుండదు. రేటింగులతో పని లేకుండా అతని సినిమాలకి ఓపెనింగ్స్‌ అయితే బ్రహ్మాండంగా వచ్చేస్తాయి.

తాజాగా స్పైడర్‌తో మరోసారి మిగతా హీరోలకీ, తనకీ ఇక్కడ తేడా ఏమిటనేది మహేష్‌ చూపిస్తున్నాడు. అసలే మహేష్‌కి తోడు మంగళవారం ప్రీమియర్‌ ఆఫర్లు జత కలిసాయేమో ఇక కలక్షన్ల కుంభవృష్టి కురుస్తోంది. ప్రీమియర్‌ షో వసూళ్ల ట్రెండ్‌ని బట్టి నాన్‌ బాహుబలి రికార్డు ఖాయమని అంటున్నారు.

కనీసం 1.2 మిలియన్‌ నుంచి 1.5 మిలియన్ల వరకు ప్రీమియర్స్‌కే వస్తాయని, ఖైదీ నంబర్‌ 150తో చిరంజీవి పేరిట వున్న రికార్డు బ్రేక్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. స్పైడర్‌ని చాలా ఎక్కువ రేట్‌కి కొనడం వల్ల యుఎస్‌లో అయిదు మిలియన్ల గ్రాస్‌ రావాలట. నిజంగా ప్రీమియర్లతో ఇంత వసూళ్లు వచ్చి, సినిమాకి మూడుపైన రేటింగులు వచ్చాయంటే మాత్రం అదేమంత పెద్ద విషయం కాదు.

బాహుబలి లాంటి స్కేల్‌ వున్న సినిమా తీస్తే తప్ప మూడు మిలియన్లు దాటని మార్కెట్‌ అది. మహేష్‌ మాత్రం ప్రతిసారీ అయిదు మిలియన్లు సాధించగల సత్తా వున్నవాడినే అని నిరూపించేస్తూ వుంటాడు. అందుకే అతని మలి చిత్రం 'భరత్‌ అనే నేను' కూడా పద్ధెనిమిది కోట్లకి పైగా రేటుకి ఓవర్సీస్‌లో అమ్ముడయింది. మహేషా మజాకా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు