ఎన్టీఆర్‌ మండి పడుతున్నాడట

ఎన్టీఆర్‌ మండి పడుతున్నాడట

మీడియాతో తనకి ఎలాంటి గొడవలు లేకపోయినా, మీడియా వారందరితో సఖ్యతగా ఉంటున్నా కానీ పలువురు మీడియా వాళ్లు తనని టార్గెట్‌ చేయడం ఎన్టీఆర్‌కి నచ్చడం లేదట. ఇంతకుముందు తనని డీఫేమ్‌ చేస్తూ టీవీ ఛానెల్స్‌లో కొన్ని ప్రోగ్రామ్స్‌ వేశారు. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్‌ అయిన తర్వాత ఇక ఎన్టీఆర్‌ పని అయిపోయినట్టే అని అందరూ అతడిని ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా ఎన్టీఆర్‌కి అస్సలు నచ్చడం లేదట.

రామయ్యా వస్తావయ్యా విజయవంతమైతే మీడియా అందర్నీ కలిసి తన ఆనందాన్ని పంచుకుందామని ఎన్టీఆర్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్‌ అవడంతో తన నెక్స్‌ట్‌ సినిమాపై దృష్టి పెట్టాడు. హరీష్‌ శంకర్‌ని నమ్మి అతను చెప్పినట్టల్లా చేసిన ఎన్టీఆర్‌ మరోసారి స్టార్‌ డైరెక్టర్‌ చేతిలో దెబ్బ తిన్నాడు. చిన్న చిన్న వార్తలకి స్పందిస్తే తన స్థాయి పడిపోతుందని ఇవన్నీ చూసీ చూడనట్టు వదిలేస్తున్న ఎన్టీఆర్‌ని మీడియా తేలిగ్గా తీసుకుంటోంది. అతను మెత్తగా ఉండేసరికి మరీ ఎక్కువగా టార్గెట్‌ చేస్తోంది. మరి వారికి ఎన్టీఆర్‌ తన నోటితో సమాధానం చెప్తాడో లేక తన సినిమాకి వచ్చే నోట్లతో సమాధానమిస్తాడో కాలమే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు