ప్రభాస్‌ హీరోయిన్‌కి పరాభవం!

ప్రభాస్‌ హీరోయిన్‌కి పరాభవం!

ప్రభాస్‌ సరసన ఎవరిని పెట్టాలా అని తెగ ఆలోచించి, ఎన్నో పేర్లు పరిశీలించి చివరకు బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ని హీరోయిన్‌గా పెట్టుకున్నారు. ఆరంభంలో ఒకటి, రెండు హిట్లు సాధించిన ఈ హీరోయిన్‌కి ఈమధ్య కాలంలో చెప్పుకోతగ్గ డిమాండ్‌ లేదు. ఈ నేపథ్యంలో ఆమె దావూద్‌ ఇబ్రహీర సోదరి హసీనా పార్కర్‌ జీవిత కథతో తీసిన హసీనా పార్కర్‌ చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేసింది.

ఈ పాత్ర తన కెరియర్‌లో గుర్తుండిపోతుందని, నటిగా ఎన్నో అంచెలు పైకి తీసుకెళుతుందని ఆమె ఆశించింది. కానీ శ్రద్ధ అంచనాలని తలకిందులు చేస్తూ ఈ చిత్రం ఘోరమైన ఫ్లాప్‌ అయింది. సినిమా ఫ్లాపయితే ఓకే కానీ వన్‌ రేటింగులు ఇచ్చిన సినీ విమర్శకులు శ్రద్ధని కామెడీ చేస్తున్నారు.

నటిగా ఆమె ఎంత వీక్‌ అనేది ఈ సినిమా చూపెట్టిందని, గాడ్‌ఫాదర్‌ సినిమాని కాపీ కొట్టాలని చూసి బోల్తా కొట్టిందని నవ్వుకుంటున్నారు. సాహో చిత్రానికి ముందు ఇది కనుక హిట్‌ అయితే ప్రభాస్‌కి ఈమె వల్ల హిందీలో మంచి బూస్ట్‌ వచ్చేది. కానీ ఇప్పుడు శ్రద్ధ హీరోయిన్‌ అంటే బాలీవుడ్‌ జనాలు ప్రత్యేక ఆసక్తి చూపించే వీల్లేదు.

నేటివిటీ సమస్యల వల్ల ఇటు తెలుగులో కూడా ఆమె వల్ల వచ్చే ప్రయోజనం వుండదు. బహుశా హసీనా పార్కర్‌ రిలీజ్‌ తర్వాత అయినట్టయితే సాహో టీమ్‌ వేరే ఆప్షన్‌ చూసుకునేదేమో. ఈమెకి మూడు కోట్లపైగా పారితోషికం ఇచ్చారంటే అదంతా దండగ కాదూ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English