సైరా పూర్తి కాకముందే పెళ్లంట

సైరా పూర్తి కాకముందే పెళ్లంట

నయనతారకి తన ప్రేమ వ్యవహారాలని దాచి పెట్టడం ఇష్టముండదు. ఎవరితో ప్రేమలో వున్నా ఓపెన్‌గానే దానిని ప్రదర్శించిన నయనతార తన తాజా ప్రేమ వ్యవహారాన్ని మాత్రం కొంతకాలం గోప్యంగా వుంచింది. శింబు, ప్రభుదేవాలతో అనుభవాలని దృష్టిలో వుంచుకుని దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమాయణాన్ని మాత్రం బయట పెట్టలేదు. మీడియాలో ఎప్పుడో లీక్‌ అయిన ఈ లవ్‌ అఫైర్‌ న్యూస్‌ ఈమధ్యే అఫీషియల్‌ అయింది.

న్యూయార్క్‌కి విహారయాత్రకి వెళ్లిన ఈ ప్రేమ జంట అక్కడ తీసుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో పెట్టింది. దీంతో శివన్‌ పట్ల నయనతార సీరియస్‌గా వుందనే సంగతి స్పష్టమయింది. కెరియర్‌లో చాలా బిజీగా వుండడంతో పెళ్లి వాయిదా వేస్తూ వచ్చిన నయనతార ఇక సెటిల్‌ అవ్వాలని చూస్తోంది.

విఘ్నేష్‌ని త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' కోసం నయనతార సైన్‌ చేసింది. ఈ చిత్రం రిలీజ్‌ అవడానికి రెండేళ్లు పడుతుంది. ఆ చిత్రం విడుదల కాకముందే నయనతార పెళ్లి అయిపోతుందని, పెళ్లి తర్వాత కూడా నటించాలని నిర్ణయించుకుంది కనుకే కొత్త సినిమాలు సైన్‌ చేయడం మానలేదని సమాచారం.

అన్నట్టు విఘ్నేష్‌ శివన్‌ని చూసిన వారందరూ అచ్చం ప్రభుదేవాలానే వున్నాడని అంటున్నారు. అతడితో ప్రేమలో పడడానికి ఇది కూడా కారణమే అనుకోవచ్చా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు