బిగ్‌బాస్‌కి కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌

బిగ్‌బాస్‌కి కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌

తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ విజయవంతంగా ముగిసింది. అయితే ఇప్పటికే హిందీలో బిగ్‌బాస్‌ పది సీజన్లు పూర్తి చేసుకుంది. నాలుగవ సీజన్‌ నుంచి దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సల్మాన్‌ఖాన్‌ మరో సీజన్‌కి కూడా ఒప్పందం చేసుకున్నాడు. సల్మాన్‌కి బదులుగా అక్షయ్‌ లేదా హృతిక్‌ వస్తారని ఊహాగానాలు సాగినా కానీ మళ్లీ సల్మాన్‌కే బిగ్‌బాస్‌ సింహాసనం దక్కింది.

తాజా సీజన్‌ కోసం సల్మాన్‌కి ఎపిసోడ్‌కి పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వడానికి స్టార్‌ నెట్‌వర్క్‌ అంగీకరించింది. బిగ్గెస్ట్‌ రియాలిటీ షో అయిన బిగ్‌బాస్‌ కోసం వారానికి ఒక్క రోజు (శనివారం) మాత్రమే సల్మాన్‌ షూట్‌ చేస్తాడు. దానిని రెండు రోజులు ప్రసారం చేస్తారు.

బిగ్‌బాస్‌ నాలుగవ సీజన్‌కి రెండున్నర కోట్ల పారితోషికం తీసుకున్న సల్మాన్‌ పదవ సీజన్‌కి వచ్చేసరికి ఎపిసోడ్‌కి ఎనిమిది కోట్లు అందుకున్నాడు. పదకొండవ సీజన్‌కి పదకొండు కోట్లు తీసుకుంటూ టెలివిజన్‌ రంగ చరిత్రలోనే కొత్త రికార్డు నెలకొల్పాడు. బిగ్‌బాస్‌ షోకి హోస్ట్‌గా మారిన తర్వాతే సల్మాన్‌ పాపులారిటీ, క్రేజ్‌ పెరుగుతూ పోయింది.

దీంతో ఈ షో అంటే ప్రత్యేక అభిమానం వున్న సల్మాన్‌ ఇప్పటికి ఎన్నిసార్లు దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్నా పెట్టలేకపోయాడు. పది సీజన్ల తర్వాత మాత్రం కొత్త హోస్ట్‌ ఖాయమని అనుకున్నారు కానీ సల్మాన్‌ మళ్లీ తన హోస్ట్‌ అవతారానికి సిద్ధమవుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు