సంఘమిత్ర ఆగిపోయిందిగా..

సంఘమిత్ర ఆగిపోయిందిగా..

‘బాహుబలి’ని కొట్టే సినిమా తీసేయాలని తమిళ సీనియర్ దర్శకుడు సుందర్ రెండేళ్ల నుంచి ‘సంఘమిత్ర’ అనే మెగా ప్రాజెక్టు మీద పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు కానిస్తూనే.. మరోవైపు ప్రమోషన్ హడావుడి కూడా చేశారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్ర బృందం చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఐతే ఇంకొన్ని రోజులకే ఈ సినిమా నుంచి శ్రుతి హాసన్ తప్పుకోవడం.. అనుకున్న సమయానికి షూటింగ్ ఆరంభం కాకపోవడంతో మొత్తంగా ఈ ప్రాజెక్టు మీదే సందేహాలు నెలకొన్నాయి. శ్రుతి తప్పుకుని ఆరు నెలలవుతున్నా.. ఇంకో హీరోయిన్ పేరు కూడా ప్రకటించకపోవడంతో సందేహాలు బలపడ్డాయి.

ఇప్పుడు ఆ సందేహాల్ని నిజం చేసే వార్త బయటికి వచ్చింది. ‘సంఘమిత్ర’ సినిమాను సుందర్ తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు. ఈ విషయాన్ని సుందర్ భార్య ఖుష్బూనే స్వయంగా ప్రకటించింది. ఐతే ఈ సినిమా పూర్తిగా ఆగిపోలేదని ఆమె తెలిపింది. ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో.. ఈ సినిమాను తాత్కాలికంగా ఆపినట్లు ఆమె తెలిపింది. సుందర్ ఈ లోపు వేరే సినిమా చేస్తాడని ఆమె తెలిపింది.

తాను తీసిన సూపర్ హిట్ కామెడీ మూవీ కలగలప్పు (తెలుగులో జంప్ జిలాని) సీక్వెల్ సుందర్ చేయబోతున్నాడని ఖుష్బూ వెల్లడించింది. మరి ఈ సినిమా తర్వాతైనా ‘సంఘమిత్ర’ ముందుకు కదులుతుందో లేదో మరి. ఇదంతా చూస్తుంటే.. ‘సంఘమిత్ర’ టీంకు సరైన ప్లానింగ్ లేదన్న శ్రుతి హాసన్ ఆరోపణలు నిజమే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English