మణిరత్నంతో మిస్సయిన సినిమాపై మహేష్..

మణిరత్నంతో మిస్సయిన సినిమాపై మహేష్..

కొన్నేళ్ల కిందటే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తాడని.. అందులో తమిళ స్టార్ హీరో విజయ్ కూడా నటిస్తాడని ఓ వార్త హల్ చల్ చేసింది. ఆ సినిమా గురించి ఇక అధికారిక ప్రకటన వస్తుందనగా.. అది వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ ఈ ఆలోచన తెరమీదికి రాలేదు. దీని గురించి ఎన్నడూ మాట్లాడని మహేష్ ఇప్పుడు స్పందించాడు. విజయ్, తన కాంబినేషన్లో మణిరత్నం సినిమా తీయాలనుకున్న మాట వాస్తవమే అని అతను చెప్పాడు.

‘‘నాతో, విజయ్‌తో కలిసి మణిరత్నం గారు ఓ సినిమా తీయాలనుకున్న మాట నిజం. ఆ సినిమాను ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా తీయాలనుకున్నారాయన. ఆ సినిమాకు సన్నాహాలు కూడా జరిగాయి. కానీ అనుకోకుండా ఆగింది. విజయ్ కాంబినేషన్లో మున్ముందు సినిమా చేస్తానేమో. ఎవరైనా నన్ను సంప్రదించాలి. ఐతే ఇద్దరి పాత్రలకూ సమాన ప్రాధాన్యం ఉండాలన్నది నా అభిప్రయాం. ఆ తరహా మల్టీస్టారర్ సినిమాలకు నేను రెడీ’’ అని మహేష్ తెలిపాడు.

తాను చెన్నైలో చదువుకునేటపుడే తనకు విజయ్ స్నేహితుడని.. ఇంకా చాలామంది తమిళ హీరోలతో తనకు చిన్నప్పట్నుంచే పరిచయం ఉందని మహేష్ తెలిపాడు. కార్తితో పాటు యువన్ శంకర్ రాజా తనకు సెయింట్ బెడెస్ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో క్లాస్ మేట్స్ అని.. ఆ స్కూల్లోనే సూర్య కూడా చదువుకున్నాడని మహేష్ వెల్లడించాడు. తమిళ సినిమాల్లో నటించాలని ఇంతకుముందే ఒకట్రెండుసార్లు అనుకున్నా కుదరలేదని.. ‘పోకిరి’ టైంలోనే మురుగదాస్‌తో సినిమా చేయాలని అనుకున్నప్పటికీ.. ఇప్పటికి ‘స్పైడర్’తో కుదిరిందని మహేష్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు