రాజమౌళికి తప్ప ఇంకెవరికీ దమ్ము లేదా?

రాజమౌళికి తప్ప ఇంకెవరికీ దమ్ము లేదా?

రాజమౌళి మొదట్లో మాస్‌ మసాలా సినిమాలు తీసినా కానీ మగధీర తర్వాత అతని ధోరణి మారిపోయింది. హీరోయిజం ఎలివేషన్‌పై ఆధారపడి అతను సినిమాలు తీయడం లేదు. సునీల్‌తో కామెడీ థ్రిల్లర్‌ తీసి సక్సెస్‌ అయిన రాజమౌళి ఆ తర్వాత ఈగతో మరో పెద్ద ప్రయోగం చేసి తనకి సాటి లేదనిపించుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌తో బాహుబలిలాంటి జానపద చిత్రానికి శ్రీకారం చుట్టి తన రూటే సెపరేటు అని చాటుకుంటున్నాడు.

రాజమౌళి ఇలా ప్రతి సినిమాతో తనని తాను అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ, ఇంకా గొప్ప దర్శకుడిగా ఎదుగుతుంటే, అతనితో పాటే కెరీర్‌ మొదలు పెట్టిన వినాయక్‌, శ్రీనువైట్ల, పూరి జగన్నాథ్‌ తదితర దర్శకులంతా మూస సినిమాలతోనే కాలం గడుపుతున్నారు. ఇలాంటి మూస సినిమాల వల్ల ఆల్రెడీ పూరి జగన్నాథ్‌ తన క్రేజ్‌ కోల్పోయాడు. శ్రీను వైట్ల కూడా బోర్‌ కొట్టేశాడు. వినాయక్‌ కూడా మరీ రొటీన్‌ అయిపోవడంతో అతని సినిమా విడుదలైతే తప్ప అటో, ఇటో అనేది చెప్పలేక పోతున్నారు. రాజమౌళి సక్సెస్‌ అవుతుంటే చూసయినా ఎవరూ మారడం లేదు. అతనికి వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి అయినా స్ఫూర్తి పొందడం లేదు. అందుకే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి అరుదైన సినిమాలు రెండేళ్లకో, మూడేళ్లకో ఒకసారి మాత్రమే వస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English