రజినీ తర్వాత మహేష్ బాబే...

రజినీ తర్వాత మహేష్ బాబే...

దసరా సీజన్‌కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. అతడి సినిమా ‘జై లవకుశ’ అదిరిపోయే ఓపెనింగ్స్‌ తెచ్చుకుంది. తొలి రోజే రూ.30 కోట్ల షేర్‌తో దసరా ధమాకాను మొదలుపెట్టింది. ఈ వీకెండ్ అంతా ‘జై లవకుశ’ జోరు కొనసాగబోతోంది. ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్‌లో మహేష్ బాబు సినిమా ‘స్పైడర్’ వచ్చేస్తోంది.

ఈ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు. ‘స్పైడర్’ టీజర్, ట్రైలర్, ఆడియో విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ.. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్‌ను తక్కువ అంచనా వేయలేం. ఈ కాంబో మీద ఎలాంటి అంచనాలున్నాయన్నది ఈ చిత్రానికి జరిగిన బిజినెస్‌ను బట్టి అర్థమైపోతోంది. ఏకంగా రూ.160 కోట్ల దాకా బిజినెస్ చేసిందీ చిత్రం.

‘స్పైడర్’ రిలీజ్ కూడా భారీ స్థాయిలో ఉండబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 3500 థియేటర్లలో ‘స్పైడర్’ను రిలీజ్ చేయబోతున్నారు. దక్షిణాదిన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల తర్వాత అతి పెద్ద రిలీజ్ ఇదే కాబోతోంది. తమిళనాట స్టార్ హీరోల సినిమాల్ని రిలీజ్ చేసినట్లే దాదాపు 600 థియేటర్లలో ‘స్పైడర్’ను విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పాల్సిన పని లేదు.

కేరళలో తమిళ వెర్షన్.. కర్ణాటకలో తెలుగు వెర్షన్ భారీ స్థాయిలో రిలీజవ్వబోతోంది. ఉత్తరాదిన కూడా రిలీజ్ భారీగానే ప్లాన్ చేశారు. అమెరికాలో అయితే రెండు వెర్షన్లూ కలిపి ఏకంగా 400 లొకేషన్లలో రిలీజవుతున్నాయి. ఇలా అన్నీ కలిపితే 3500 స్క్రీన్లలో ‘స్పైడర్’ సందడి చేయబోతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. ‘స్పైడర్’ కలెక్షన్లు మామూలుగా ఉండవేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు