దత్త పుత్రిక తో రొమ్మాన్స్... నేను రేడీ

దత్త పుత్రిక తో రొమ్మాన్స్... నేను రేడీ

ఏదైనా ఒక పెద్ద వివాదం బయటికి వస్తే.. దాని మీద హాట్ హాట్ డిస్కషన్లు జరుగుతుంటే.. దాని మీద సినిమా తీయడానికి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు రెడీ అవుతుంటారు. సినిమా తీస్తాడా లేదా అన్నది తర్వాత ముందైతే ఒక అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చేస్తాడు వర్మ.

గత మూడు నాలుగు వారాలుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న డేరా బాబ గుర్మీత్ సింగ్ వ్యవహారం మీద వర్మ ఇంకా సినిమా అనౌన్స్ చేయట్లేదేంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఐతే ఈ వ్యవహారంపై వర్మ సైలెంటుగా ఉండగా.. బాలీవుడ్ కాంట్రవర్శీ క్వీన్ రాఖీ సావంత్.. తాను గుర్మీత్ బాబా మీద సినిమా తీయబోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచింది.

తన ప్రియుడితో కలిసి గుర్మీత్ బాబా మీ సినిమా నిర్మిస్తానని ప్రకటించింది రాఖీ. ఇందుకోసం డేరా బాబా ఆశ్రమానికి సంబంధించిన సెట్టింగ్ ఎలా వెయ్యాలని చర్చిస్తున్నామని.. త్వరలోనే సెట్టింగ్ పనులు కూడా మొదలవుతాయని రాఖీ చెప్పడం విశేషం. గుర్మీత్ గురించి తనకు చాలా తెలుసని.. అతడి అకృత్యాలన్నింటినీ సినిమాలో చూపిస్తామని రాఖీ తెలిపింది. ఈ సినిమాలో తాను గుర్మీత్ దత్త పుత్రిక హనీ ప్రీత్ పాత్ర పోషించబోతున్నట్లు రాఖీ చెప్పింది.

హనీ ప్రీత్ తనకు ఐదేళ్లుగా పరిచయమని.. తన అలవాట్లు.. నడవడిక అన్నీ తనకు తెలుసని.. కాబట్టి ఆ పాత్రను తాను అవలీలగా పోషిస్తానని రాఖీ చెప్పింది. ఐతే ఈ ప్రకటనలు గొప్పగా అనిపిస్తున్నా.. నిజంగా రాఖీకి ఈ సినిమా చేసేంత సీన్ ఉందా అని బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు