బాబీకి ఎక్కువ సీన్‌ ఇచ్చారా?

బాబీకి ఎక్కువ సీన్‌ ఇచ్చారా?

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పరాజయాన్ని పవన్‌కళ్యాణ్‌ అకౌంట్‌లో వేసేసి, దర్శకుడు బాబీని సరిగా పని చేయనివ్వలేదని చెప్పుకున్నారు. యువ దర్శకుడి కెరియర్‌తో పవన్‌ ఆడుకున్నాడని కూడా నిందలు వేసారు. ఎన్టీఆర్‌ అతనికి అవకాశమిచ్చే సరికి బాబీ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో, కసితో తన టాలెంట్‌ చూపిస్తాడని అన్నారు.

తీరా చూస్తే 'జై లవకుశ'లో అతను తుస్సుమనిపించాడు. కనీసం తన మొదటి సినిమా పవర్‌లో హార్బర్‌ సీన్‌ లాంటిదైనా 'జై లవకుశ'లో పెట్టలేకపోయాడు. ఎన్టీఆర్‌ లాంటి హీరోని పెట్టుకుని సరయిన ఎలివేషన్‌ సీనే తీయలేకపోయాడు. ఎన్టీఆర్‌ నట విశ్వరూపాన్ని ప్రదర్శించినా కానీ బాబీ సవ్యమైన సీన్లు రాసుకోకపోవడం వల్ల సినిమా అంతా తేలిపోయింది. తన కసి చూపిస్తాడని అనుకున్న అభిమానులు ఇప్పుడు బాబీని తిట్టుకుంటున్నారు. ఒక మంచి పాత్ర, కథ ఇతని వల్ల వృధా అయ్యాయనే కామెంట్లు పడుతున్నాయి.

ఇంత కాదు అంత అంటూ చెప్పుకుంటూ వచ్చిన బాబీ అసలు విషయానికి వచ్చేసరికి చేతులెత్తేస్తాడు. ఈ చిత్రాన్ని సరిగ్గా వాడుకుని వుంటే బాబీ ఒకేసారి టాప్‌ దర్శకుల సరసన చేరేవాడు. కానీ ఇద్దరు అగ్ర హీరోలు అవకాశాలు ఇచ్చినా కానీ అరకొర అవుట్‌పుట్‌తో సరిపెట్టేయడంతో ఇక మిగతా టాప్‌ హీరోలు ఇతనంటే ఆసక్తి చూపించకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English