మహేష్‌కి ఇదే సూపర్‌ ఛాన్స్‌

మహేష్‌కి ఇదే సూపర్‌ ఛాన్స్‌

భారీ హిట్‌ ఇచ్చిన తర్వాత మళ్లీ అలాంటి ఘన విజయాన్ని అందుకోవడం అనేది మహేష్‌ కెరియర్‌లో చాలా అరుదుగా జరిగింది. చాలా సార్లు పెద్ద హిట్‌ తర్వాత డిజాస్టర్లు రావడం వల్ల మహేష్‌ నంబర్‌ వన్‌ స్థానాన్ని అందుకోలేకపోయాడు. తన వెనక వున్న హీరోలకి తనని అందుకునే అవకాశాన్ని ఇచ్చాడు. శ్రీమంతుడు తర్వాత బ్రహ్మూెత్సవం లాంటి డిజాస్టర్‌ రావడం మహేష్‌ని బాగా ఇబ్బంది పెట్టింది.

ఈ టైమ్‌లో ప్రభాస్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లాంటి వారు టాప్‌ ప్లేస్‌కి పోటీదారులుగా మారారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌పై ఎప్పుడూ పైచేయి సాధించే మహేష్‌కి ఇప్పుడు అతనితో పెద్ద అంతరం లేదు. ఈ నేపథ్యంలో జై లవకుశ, స్పైడర్‌ క్లాష్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండిట్లో ఏ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంటే ఆ హీరోకి ఆటోమేటిగ్గా అప్పర్‌హ్యాండ్‌ దక్కుతుంది.

జై లవకుశ యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో స్పైడర్‌కి అవకాశమొచ్చింది. ఈ చిత్రం కనుక హిట్‌ టాక్‌ తెచ్చుకుని 'జై లవకుశ' కంటే అత్యధిక వసూళ్లు సాధించినట్టయితే అప్పుడు మహేష్‌ రేసులో ముందుకెళ్లిపోతాడు. ప్రస్తుతానికి అయితే స్పైడర్‌కి సర్వ హంగులు వున్నట్టే అనిపిస్తోంది కానీ అసలు కథ ఏమిటనేది ఫస్ట్‌ షో స్క్రీన్‌ అయితే కానీ తెలీదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు