ట్రంప్‌కు పిచ్చిప‌ట్టింది....నేను ఆ తిక్క కుదిరిస్తా

ట్రంప్‌కు పిచ్చిప‌ట్టింది....నేను ఆ తిక్క కుదిరిస్తా

ఇన్నాళ్లు ప్ర‌సార సాధనాల ద్వారా, ప‌రోక్ష చ‌ర్య‌ల ద్వారా త‌న స‌త్తాను చాటిన నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు నేరుగా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. ఉత్తర కొరియాను నాశనం చేస్తానని క‌ల‌కలం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కిమ్ ఇవాళ మీడియా ముందుకు వచ్చి  బహిరంగ ప్రకటన చేశారు. జాతీయ ఛానల్‌లో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తెగ తిట్టిపారేశారు. ట్రంప్ తిక్క కుదురుస్తా అని కిమ్ వార్నింగ్ ఇచ్చారు.

ఐక్యరాజ్యసమితిలో తొలిసారిగా ప్ర‌సంగిస్తూ ఉత్తర కొరియాపై ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కిమ్ విరుచుకుప‌డ్డారు.  ట్రంప్ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని కిమ్ హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్‌కు పట్టిన పిచ్చిని వదిలిస్తానని కిమ్ అన్నారు. తమ దేశానికి అణ్వాయుధాలు అభివృద్ధి చేసే హక్కు ఉందన్నారు. ఇవాళ తొలిసారి ఇంగ్లీష్‌లో మాట్లాడిన కిమ్.. అమెరికా దేశాధినేతపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ``ట్రంప్ మాటలు నన్ను కన్విన్స్ చేస్తున్నాయి, ఆయన మాటలు నన్నేమీ భయపెట్టలేదు.. కనీసం నన్ను ఆపలేవు.. నేను ఎన్నుకున్న మార్గం కరెక్ట్ అని అవి గుర్తు చేశాయి, ఆ మార్గాన్నే నేను చివర వరకు అనుసరిస్తాను`` అని కిమ్ అన్నారు. ప్రపంచ దేశాల ముందు నార్త్ కొరియాను ట్రంప్ అవమానించారని, తమపై యుద్ధం చేసి నాశనం చేస్తానని అన్నారని, ఆ పిచ్చి మాటలకు ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కిమ్ హెచ్చరించారు. ``ట్రంప్ ఓ రోగ్.. ఓ గ్యాంగ్‌స్టర్.. అతను రాజకీయవేత్త కానే కాదు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందర్నీ బెదిరిస్తున్నాడు. బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు, సుప్రీమ్ కమాండర్‌గా పనికిరాడు`` అని ట్రంప్‌ను ఉద్దేశిస్తూ కిమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడులతోనే ఆ ముసలి ట్రంప్ తిక్క కుదిరిస్తానని కిమ్ హెచ్చరించారు.

కాగా, ఇటీవల ఉత్తర కొరియా పదేపదే మిసైల్, అణుపరీక్షలతో టెన్షన్ పుట్టిస్తున్నది. అంతేకాదు, అమెరికా నేలను టార్గెట్ చేసే విధంగా కూడా మిస్సైల్ ప్రయోగాలను నిర్వహిస్తున్నది. దీంతో అమెరికా, నార్త్ కొరియా మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. రాకెట్ మ్యాన్ కిమ్ ఓ సూసైడ్ మిషన్ మీద ఉన్నాడని ట్రంప్ ఆరోపించారు. ఇలా అంత‌ర్జాతీయ స‌మాజం విమ‌ర్శ‌లు, ట్రంప్ కామెంట్ల నేపథ్యంలో చాలా అరుదైన రీతిలో కిమ్ ప్రపంచ దేశాలను ఉద్దేశిస్తూ వ్యక్తిగత ప్రకటన చేయ‌డం గ‌మ‌నార్హం.  అవసరమైతే పసిఫిక్ తీరంలో హైడ్రోజన్ బాంబును పరీక్షించేందుకు నార్త్ కొరియా సిద్ధంగా ఉన్నట్లు ప‌లువురు దౌత్య‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు