ఎన్నిసార్లు మారుస్తారయ్యా రిలీజ్ డేట్..

ఎన్నిసార్లు మారుస్తారయ్యా రిలీజ్ డేట్..

గోపీచంద్ నుంచి కొత్త సినిమా ఏదైనా వస్తోందంటే అది ఎలా ఉంటుందన్న అంచనాలు పక్కన పెట్టేసి.. అది అసలు అనుకున్న తేదీకి రిలీజవుతుందా లేదా అని చర్చించే పరిస్థితి కనిపిస్తోంది. ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా సంగతేమైందో తెలసిందే. ఏళ్లకు ఏళ్లు షూటింగ్ జరుపుకుని ఎట్టకేలకు కొన్ని నెలల కిందట విడుదలకు సిద్ధమైతే.. ఇంకొన్ని గంటల్లో షో పడబోతుందనగా దానికి బ్రేక్ పడిపోయింది.

ఆ తర్వాత ఆ సినిమా అడ్రస్ లేదు. గోపీ నుంచి రావాల్సిన మరో సినిమా ‘ఆక్సిజన్’ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని ఇదిగో అదిగో అంటున్నారు. రిలీజ్ చేయట్లేదు.

ఇప్పటికే రెండు మూడు రిలీజ్ డేట్లు మారాయి. కొన్ని రోజుల కిందటే అక్టోబరు 13న ‘ఆక్సిజన్’ రిలీజ్ అని ప్రకటించారు. అదే రోజు నాగార్జున సినిమా ‘రాజు గారి గది-2’.. ముందు రోజు రవితేజ మూవీ ‘రాజా ది గ్రేట్’ విడుదలవుతున్న నేపథ్యంలో గోపీ సినిమాకు ఖాళీ ఎక్కడుందని అప్పుడే సందేహించారు. ఆ సందేహాలే నిజమయ్యాయి. ఈ సినిమాను మళ్లీ వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త డేట్ ఇచ్చారు. అక్టోబరు 27న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

మరి ఆ రోజుకు ఏవైనా వేరే సినిమాలు షెడ్యూల్ అయితే ఏం చేస్తారో చూడాలి. సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం తన పెద్ద కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ఆక్సిజన్’. ఇందులో గోపీ సరసన రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయెల్ నటించారు. జగపతిబాబు కీలక పాత్ర పోషించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు