నాన్-బాహుబలి రికార్డు పక్కా?

నాన్-బాహుబలి రికార్డు పక్కా?

మొత్తానికి ‘జై లవకుశ’ సక్సెస్ ఫుల్ సినిమా అని తేలిపోయింది. తొలి రోజు ఈ చిత్రానికి అన్నిచోట్ల పాజిటివ్ టాకే వచ్చింది. బాక్సాఫీస్ స్లంప్‌లో ఉన్న టైంలో వచ్చిన భారీ సినిమా కావడం, మంచి హైప్ ఉండటం, భారీగా రిలీజ్ చేయడంతో, అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడటంతో తొలి రోజు ఈ సినిమా వసూళ్లు అంచనాల్ని మించి ఉంటాయని భావిస్తున్నారు.

ఇంకా ఫైనల్ ఫిగర్ ఎంతన్నది క్లారిటీ లేదు కానీ.. తొలి రోజు నాన్-బాహుబలి రికార్డయితే బద్దలైనట్లే అని ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. చాలా ఏరియాల్లో నాన్-బాహుబలి రికార్డులు నమోదైనట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. నైజాం ఏరియాలో తొలి రోజు రూ.5.05 కోట్లు.. సీడెడ్లో రూ.3.77 కోట్ల షేర్ తెచ్చుకుంది ‘జై లవకుశ’. ఇవి రెండూ నాన్-బాహుబలి రికార్డులే.

అలాగే కృష్ణా లాంటి చిన్న జిల్లాలోనే ‘జై లవకుశ’ తొలి రోజు ఏకంగా రూ.1.7 కోట్ల షేర్ రాబట్టడంఅసాధారణమైన విషయం. ఇది కూడా రికార్డే. తొలి రోజు తెలుగు రాష్ట్రాల వరకే రూ.22 కోట్లకు పైగా షేర్ వచ్చినట్లు చెబుతున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ‘జై లవకుశ’ కళ్లు చెదిరే నంబర్స్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో ప్రిమియర్లతోనే ఈ చిత్రం 5.89 లక్షల డాలర్లు వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక ప్రిమియర్ కలెక్షన్లు నమోదు చేసింది.

గురువారం వసూళ్లను కూడా కలుపుకుంటే 9 లక్షల డాలర్ల వరకు ఉండేట్లున్నాయి కలెక్షన్లు. ఓవరాల్ గా ‘జై లవకుశ’ తొలి రోజు షేర్ రూ.35 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ‘ఖైదీ నంబర్ 150’ పేరిట ఉన్న నాన్-బాహుబలి రికార్డు బద్దలైపోయినట్లే.