ఆ లెజెండ్ మళ్లీ డైరెక్టర్లపై పడ్డాడు

ఆ లెజెండ్ మళ్లీ డైరెక్టర్లపై పడ్డాడు

నాలుగేళ్ల కిందట బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ఊపు మామూలుగా ఉండేది కాదు. ‘యే హసీనా కీ దివానా’ సినిమాతో కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి.. భవిష్యత్తులో ఖాన్ త్రయానికి గట్టి పోటీ ఇచ్చేలా కనిపించాడు. కానీ ఆ తర్వాత ఆ ఊపును కొనసాగించలేకపోయాడు వరుస ఫ్లాపులతో బాగా వెనుకబడిపోయాడు.

ఈ మధ్యే వచ్చిన ‘జగ్గా జాసూస్’ అతణ్ని మరింత కిందికి లాగేసింది. తన కొడుకు కెరీర్ రోజు రోజుకూ దెబ్బ తింటుండే సరికి రణబీర్ తండ్రి.. లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటికే ‘జగ్గా జాసూస్’ దర్వకుడు అనురాగ్ బసు మీద రిషి ఒకసారి విరుచుకుపడ్డాడు.

తాజాగా నేహా ధూపియా నిర్వహించే షోకు వచ్చిన రిషి.. మరోసారి అనురాగ్ బసును టార్గెట్ చేసుకున్నాడు. అతణ్ని మాత్రమే కాదు.. రణబీర్‌తో ‘బాంబే వెల్వెట్’ లాంటి డిజాస్టర్ ఇచ్చిన అనురాగ్ కశ్యప్‌ను కూడా వదిలిపెట్టలేదు రిషి. నేహా ఊరికే ఉండకుండా ‘అనురాగ్’ అనే పదం గురించి ఓ నిమిషం మాట్లాడండి అని రిషిని అడిగింది. ఇక అంతే.. పెద్దాయన రెచ్చిపోయాడు.

ఈ ఇద్దరు దర్శకులు కలిసి తన కొడుకు కెరీర్‌ను నాశనం చేశారని రిషి అన్నాడు. అనురాగ్ కశ్యప్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ లాంటి మంచి సినిమా తీశాడని.. కానీ ‘బాంబే వెల్వెట్’‌తో కొంప ముంచాడని అన్నాడు. ఇక అనురాగ్ బసు తన కొడుకుతో ఇంతకుముందు ‘బర్ఫీ’ లాంటి మంచి సినిమా చేశాడని.. కానీ ఇప్పుడతను ‘జగ్గా జాసూస్’ లాంటి తలా తోకా లేని సినిమా తీశాడని అన్నాడు. ఈ దర్శకులిద్దరూ తామేదో గొప్ప సినిమాలు చేస్తున్నామని.. కళాఖండాలు తీస్తున్నామని అనుకున్నారని.. కానీ అవి అర్థం పర్థం లేని సినిమాలని.. వీళ్ల వల్ల తన కొడుకు అన్యాయం అయిపోయాడని రిషి ఆవేదన వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు