నిర్మాతల్ని క్షమించమని అడిగిన విజయేంద్ర

నిర్మాతల్ని క్షమించమని అడిగిన విజయేంద్ర

‘బాహుబలి’తో భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్. ‘బాహుబలి’ మాత్రమే కాక ఆయన కలం నుంచి అనేక బ్లాక్ బస్టర్లు జాలువారాయి. హిందీలో సైతం ‘భజరంగి భాయిజాన్’ లాంటి మెగా హిట్ ఇచ్చాడు విజయేంద్ర. అలాంటి లెజెండ్.. ఇద్దరు కొత్త నిర్మాతలకు బహిరంగ వేదికలో క్షమాపణ చెప్పాడు. తనను క్షమించాలని అడిగాడు. వాళ్లు వారిస్తున్నా ఊరుకోకుండా ఒకటికి రెండుసార్లు మన్నించాలని అడిగాడు విజయేంద్ర ప్రసాద్. ఇందుకు కారణం.. శ్రీవల్లీ. ఈ చిత్ర సక్సెస్ మీట్లో విజయేంద్ర ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

నిర్మాతలు కొత్తవాళ్లతో ఓ ప్రయోగాత్మక సినిమా తీసి విజయవంతమయ్యారని.. దీన్ని బాగా రిలీజ్ చేశారని.. గత వారం వచ్చిన సినిమాల్లో తమదే బెస్ట్ అని.. సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకులతో పాటు బయ్యర్లను కూడా సంతోషపెట్టిందని అంటూనే.. ఈ సినిమా విషయంలో తాను ఒక్కడిని మాత్రమే ఫెయిలయ్యానని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. సినిమాకు సంబంధించి అందరూ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చినప్పటికీ దర్శకుడిగా తాను మాత్రమే ఫెయిలయ్యానని అన్నాడు విజయేంద్ర. తాను మంచి కథ రాశానని.. ఆ కథ విషయంలో సంతృప్తి చెందానని.. కానీ ఆ కథను అనుకున్నంత బాగా తెరకెక్కించలేకపోయానని అనుకుంటున్నట్లుగా ఆయన చెప్పాడు.

తాను ఇంకా బాగా తీసి ఉంటే సినిమా ఇంకా మంచి ఫలితాన్ని అందుకునేదన్నాడు విజయేంద్ర. మొత్తానికి ఇలా ఓ సక్సెస్ మీట్లో దర్శకుడు తాను సినిమా బాగా తీయలేదని ఒప్పుకోవడానికి ఎన్ని గట్స్ ఉండాలో కదా? సినిమా ఎలా ఉన్నప్పటికీ ఈ విషయంలో విజయేంద్రకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English