బాహుబ‌లిగా న‌టిస్తానన్న హీరోయిన్‌!

బాహుబ‌లిగా న‌టిస్తానన్న హీరోయిన్‌!

టాలీవుడ్ లో అందంతో పాటు అభిన‌యం క‌ల‌గ‌లిపిన హీరోయిన్ గా నివేదా థామ‌స్‌ మంచి పేరు తెచ్చుకుంది. జెంటిల్మ‌న్, నిన్నుకోరి చిత్రాల‌లో లో నానితో పోటీప‌డి న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకుంది. త‌న కెరీర్ లో మూడో సినిమా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో చేసే చాన్స్ కొట్టేసింది. గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న‘జై లవకుశ’ ప్ర‌మోష‌న్ లో భాగంగా నివేదా ఓ రేడియో ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా నివేదా ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఒక వేళ త‌న‌కు అవ‌కాశ‌మొస్తే బాహుబ‌లిలో ప్ర‌భాస్‌ పాత్ర‌ను చేస్తాన‌ని చెప్పి యాంక‌ర్ కు షాకిచ్చింది నివేదా.

‘బాహుబలి’ విడుదలకు ముందే రాజమౌళికి నివేద పెద్ద అభిమాన‌ట‌. అంతేకాదు, అవ‌కాశం వ‌స్తే ఆయన దర్శకత్వంలో నటించ‌డానికి రెడీ అని చెప్పింది నివేదా. ఒక వేళ త‌న‌కు బాహుబ‌లిలో న‌టించే అవ‌కాశం వ‌స్తే అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్యకృష్ణ లో పోషించిన పాత్ర‌ల్లో కాకుండా ప్ర‌భాస్ పోషించిన బాహుబ‌లి పాత్ర‌లో న‌టిస్తాన‌ని చెప్పింది. తన బలహీనత ఆహారమని, త‌న బ‌ల‌మ‌ని చెప్పింది. తనకి 21 సంవత్సరాలేనని, ఇప్పుడే పెళ్లి గురించిన ఆలోచ‌న లేద‌ని చెప్పేసింది. జై ల‌వ‌కుశ వంటి మంచి సినిమా తీశామన్న నమ్మకం ఉంద‌ని, త‌ప్ప‌క ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని చెప్పింది. పైరసీని ప్రోత్సహించవ‌ద్ద‌ని మెసేజ్ ఇచ్చింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేసింది నివేదా. ఎన్టీఆర్‌ నిబద్ధత కలిగిన వ్యక్తని, సినిమా కోసం చాలా కష్టపడతార‌ని కితాబిచ్చింది. ఎన్టీఆర్ ను  కరెంట్‌తీగతో పోల్చేసింది నివేదా. జై ల‌వ‌కుశ‌లో తాను ఓ పంజాబీ అమ్మాయిగా కనిపిస్తాన‌ని, త‌న‌ది చాలా హుషారైన పాత్ర అని చెప్పుకొచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు