ఆ సినిమా తర్వాతే డిసైడవుతా: ఎన్టీఆర్‌

ఆ సినిమా తర్వాతే డిసైడవుతా: ఎన్టీఆర్‌

మాస్‌ హీరోగా తిరుగులేని ఇమేజ్‌ సాధించిన ఎన్టీఆర్‌ చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి మాస్‌ పాత్రలో 'జై'గా కనిపించబోతున్నాడు. 'జై లవకుశ' తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి కమిట్‌ అయిన ఎన్టీఆర్‌, అది లేట్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నా కానీ నెక్స్‌ట్‌ త్రివిక్రమ్‌తోనే చేస్తానంటున్నాడు. త్రివిక్రమ్‌తో చేయాలనేది ఎన్టీఆర్‌కి ఎప్పట్నుంచో వున్న కోరిక.

చాన్నాళ్లుగా వాయిదా పడుతోన్న ఈ ప్రాజెక్ట్‌ ఫైనల్‌గా పట్టాలెక్కుతోంది. ఈ చిత్రంతో హీరోగా తనకి పూర్తిస్థాయి ఆల్‌రౌండ్‌ ఇమేజ్‌ వచ్చేస్తుందనేది ఎన్టీఆర్‌ నమ్మకం. మాస్‌ హీరోగా తనకున్న ఫాలోయింగ్‌కి త్రివిక్రమ్‌కి వున్న క్లాస్‌, ఫ్యామిలీస్‌ సపోర్ట్‌ యాడ్‌ అయితే ఇక ఆ చిత్రానికి ఆకాశమే హద్దు. అందుకే ఈ చిత్రం కోసమే ఎన్టీఆర్‌ చాలా ఇదిగా ఎదురు చూస్తున్నాడట. వేరే దర్శకులతో చర్చలు జరుపుతున్నట్టు వస్తోన్న వార్తలు కూడా అతను ఖండించాడు.

కొరటాల, రాజమౌళితో సినిమాలున్నాయనేది కూడా ప్రస్తుతానికి వాస్తవం కాదని, త్రివిక్రమ్‌ సినిమా తప్ప మరోటి ఇంకా ఓకే చేయలేదని, త్రివిక్రమ్‌తో చేసే చిత్రం తర్వాత తదుపరి చిత్రంపై నిర్ణయానికి వస్తానని చెప్పాడు. ఇప్పటికే తన మార్కెట్‌ మునుపటి కంటే స్ట్రాంగ్‌ అయినా కానీ నైజాం లాంటి ఏరియాలో ఇంకా ఎన్టీఆర్‌ వెనకే వున్నాడు. త్రివిక్రమ్‌ మూవీతో ఆ లోటు తీరిపోయి, ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్‌ ఆల్‌రౌండర్‌ ఇమేజ్‌ వచ్చేస్తుందని అతను ఆశిస్తున్నాడు. రాజమౌళితో చిత్రం కోసం తాను అడగనని, అతను కనుక తనకి సెట్‌ అయ్యే కథ వుందనిపిస్తే తనంతట తానుగా వచ్చేస్తాడని, కనుక అడిగి అతడిని మొహమాట పెట్టనని ఎన్టీఆర్‌ పేర్కొన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు