చిరు రికార్డును బద్దలు కొట్టేస్తాడా?

చిరు రికార్డును బద్దలు కొట్టేస్తాడా?

‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ లెక్కలే మారిపోయాయి. మన మార్కెట్ పరిధి బాగా విస్తరించింది. తెలుగు పొటెన్షియాలిటీ ఏంటన్నది రుజువు చేసిన సినిమా ‘బాహుబలి’. ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి.. హైప్ ఎలా పెంచాలి.. రిలీజ్ విషయంలో ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి.. బిజినెస్ ఎలా చేసుకోవాలి.. కలెక్షన్లు ఎలా పెంచుకోవాలి.. ఇలా అనేక విషయాల్లో ఒక రోల్ మోడల్ లాగా మారిపోయింది.

ఆ తర్వాత వచ్చిన భారీ సినిమాలన్నీ ‘బాహుబలి’ బాటలోనే పయనిస్తున్నాయి. తమ మార్కెట్ పరిధిని విస్తరించుకుని.. బిజినెస్, కలెక్షన్ల విషయాల్లో కొత్త శిఖరాల్ని అందుకుంటున్నాయి.

ఈ కోవలోనే ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ అతడి కెరీర్లోనే అత్యధికంగా రూ.110 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో కూడా విడుదలవుతోంది. దీనికి వచ్చిన హైప్ ప్రకారం చూస్తే తొలి రోజు.. తొలి వారాంతంలో ‘జై లవకుశ’ నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టేందుకు పుష్కలంగా ఉన్నాయి. పూర్తి నెగెటివ్ టాక్ వస్తే తప్ప ‘జై లవకుశ’ కలెక్షన్లు భారీగానే ఉండే అవకాశముంది.

తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే.. ఫస్ట్ వీకెండ్ నాన్-బాహుబలి రికార్డు చిరంజీవి సినిమా ‘ఖైదీ నంబర్ 150’ పేరిట ఉన్నాయి. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ‘జై లవకుశ’ ఆ రికార్డుల్ని బద్దలు కొట్టడం లాంఛనమే కావచ్చు. ఐతే వారం తిరిగేసరికే మహేష్ ‘స్పైడర్’తో వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ సాధించిన రికార్డులు ఎన్నో రోజులు నిలిచే అవకాశం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు