బిగ్ షాక్‌.. వ‌ర్మను అరెస్టు చేయాల‌న్న కోర్టు

బిగ్ షాక్‌.. వ‌ర్మను అరెస్టు చేయాల‌న్న కోర్టు

అవును! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఈరోజో రేపో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ చిప్ప‌కూడు తిన‌డం ఖాయమ‌నే వాద‌నే వినిపిస్తోంది! వ‌ర్మ‌ను త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాల‌ని విజ‌య‌వాడ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేసి విజ‌య‌వాడ తెచ్చేందుకు బెజ‌వాడ పోలీసులు రెడీ అయ్యారు. నోటికి ఎంత మాట వ‌స్తే అంత‌మాట అనేసి, త‌న మైండ్‌కు ఏది తోస్తే.. దానిని వెండితెర‌పై ఎక్కించేయ‌డం, ఎవ‌రు ఏం చేస్తారులే అని ధీమా వ్య‌క్తం చేయ‌డం ఇటీవ‌ల కాలంలో ఈ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడికి కామ‌న్ అయిపోయింది. ప్ర‌తి విష‌యంలోనూ వేలు పెట్ట‌డం కూడా వ‌ర్మ‌కు నేచుర‌ల్ ఇష్యూ అయిపోయింది.

అందుకే నెటిజ‌న్ల‌లో స‌గానికిపైగా వ‌ర్మ పోస్టుల‌పై మండి ప‌డేవారే ఉన్నారు. అంత‌లా.. కాలేలా వ్యాఖ్యానించ‌డ‌మే కాకుండా తాను చేసిన వ్యాఖ్య‌లు, తీసిన సినిమాల‌ను సైతం స‌మ‌ర్ధించుకోవ‌డం ఈయ‌న‌గారి స్పెషాలిటీ. ఆ మొండిత‌నంతోనే విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఒక వెలుగు వెలిగిన వంగ‌వీటి రంగా, ఆయ‌న సోద‌రుడు రాధాల‌పై వివాదాస్ప‌ద రీతిలో `వంగ‌వీటి` సినిమాను తెర‌కెక్కించాడు వ‌ర్మ‌. అప్ప‌ట్లోనే ఈ సినిమాను తీయొద్ద‌ని రంగా అభిమానులు, రంగా మిత్ర మండ‌లి పెద్ద ఎత్తున వ‌ర్మ‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అదేవిధంగా రంగా త‌న‌యుడు మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా కృష్ణ అయితే, ఇలా ఒక‌రి జీవిత చ‌రిత్ర‌ను తీసే హ‌క్కు ఎక్క‌డిద‌ని ప్ర‌శ్నించారు. తీవ్ర‌స్థాయిలో వ‌ర్మ ప్ర‌య‌త్నాన్ని అడ్డుకున్నారు.

అయినా కూడా వ‌ర్మ త‌న మొండి వైఖ‌రినే ప్ర‌ద‌ర్శించాడు. సినిమా తీసి విడుద‌ల కూడా చేశాడు. త‌ర్వాత అనేక ఘ‌ర్ష‌ణ‌ల‌కు ఈ మూవీ వేదికైంది. ఇక‌, సినిమా రూపొందిస్తున్న క్ర‌మంలోనే వంగ‌వీటి మూవీపై రంగా కుటుంబం కోర్టును ఆశ్ర‌యించి న్యాయ పోరాటానికి దిగింది. రంగా త‌న‌యుడు రాధా.. వ‌ర్మ త‌న మొండి వైఖ‌రితో త‌మ కుటుంబం ప‌రువును బ‌జారుకు ఈడ్చార‌ని, కుటుంబాన్ని అవ‌మాన ప‌రిచే రీతిలో సినిమా తీస్తున్నార‌ని పేర్కొంటూ.. ద‌ర్శ‌కుడిగా రాంగోపాల్ వ‌ర్మ‌పైనా, ఈ చిత్రం నిర్మాత దాస‌రి కిర‌ణ్‌కుమార్‌ల‌పైనా విజ‌య‌వాడ కోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిని సుదీర్ఘంగా విచారించిన కోర్టు.. తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ ఉత్త‌ర్వుల్లో కోర్టు షాకింగ్ కామెంట్లు చేసింది. రాంగోపాల్‌ వర్మ, దాసరి కిరణ్‌ కుమార్‌లపై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, అరెస్టు చేయాల‌ని పోలీసులను ఆదేశించింది. వాస్త‌వానికి ఈ కేసు వీగి పోతుంద‌ని వ‌ర్మ భావించాడు. అయితే, కోర్టు తాజా ఉత్త‌ర్వుల‌తో ఆయ‌న బిత్త‌ర‌పోయిన‌ట్టు స‌మాచారం. నిజానికి త‌న‌పై ఏదైనా కామెంట్ వ‌స్తే.. వెంట‌నే ట్విట్ట‌ర్‌లో స్పందించే వ‌ర్మ‌.. ఈ ఉత్త‌ర్వులు జారీ అయిన విష‌యం తెలిసి కూడా స్పందించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. వంగ‌వీటి అంశం.. వ‌ర్మ‌తో ఊచ‌లు లెక్క పెట్టిస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు